సింపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లవ్ చంద్రబాబూ

మంత్రి అంబటి రాంబాబు

 విజయవాడ: అరెస్టు పేరుతో సింపతి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు, అలాంటి సంపతి రాజకీయాలు ఇప్పుడు చెల్లబోవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  చట్టం తన పని తాను చేసుకుంటుంది.. చట్టానికి అడ్డుపడితే చంద్రబాబుపై చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
 ఈ రాష్ట్రంలో పెద్ద రాక్షసుడు, పిల్ల రాక్షసుడు, దత్త రాక్షసుడు తయారయ్యారు. కారణం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కానీ, చంద్రబాబుకు ఎందుకంత భయమో అర్థం కావడం లేదు.
 
 ప్రాథమిక ఆధారాలు లేనిదే ఏ కేసులు పెట్టరు.. ధైర్యం ఉంటే ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. చంద్రబాబు తప్పు చేస్తే తప్పించుకోలేరు.. తప్పు చేయక పోతే అరెస్ట్ ఉండదు.  చంద్రబాబు దొంగ అయిన పవన్ కల్యాణ్‌ ఒప్పుకోడు. 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నాడని చంద్రబాబుపై ఆరోపణలు వచ్చినా, పవన్ కల్యాణ్‌ నోరు మెదపడు.. అది వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం అలాంటింది. 

 ఈ ఏడు వర్షాలు సమృద్దిగా పడలేదని  మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శ్రీశైలం , సాగర్, పులిచింతల ప్రాజెక్టుల లో పూర్తి స్థాయి లో నీరు లేదు.. గతంలో ఓవర్ ఫ్లో ఉండేది. ఈ సంవత్సరం ఆగస్టులో సాధారణం కంటే మైనస్ 31 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది.  సాగర్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది.. సాగర్ ఆయకట్టులో ఉన్న పరిస్థితిని రైతులు గుర్తించాలి.. ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆరుతడి పంటలపై సాగర్ ఆయకట్టు రైతులు దృష్టి పెట్టాలి.. డెల్టాలో నాట్లుకు ఇబ్బంది లేదు.. అవసరం అయితే వారా బంది నిర్వహిస్తాం. భవిష్యత్ లో మంచి వర్షాలు పడతాయని మంత్రి అంబటి రాంబాబు ఆశాభావం వ్య‌క్తం చేశారు. 

Back to Top