విద్యారంగానికి అధిక ప్రాధాన్యం

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
 

 

పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఏలూరు జిల్లా పరిషత్‌తో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చారని గుర్తుచేశారు. బడ్జెట్‌లో విద్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారన్నారు. ఉన్నత వర్గాల పిల్లలతో పోటీగా పేద పిల్లలు చదుకునేందుకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం రెండు దశల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఏ నాయకుడు ఇవ్వని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ విద్యారంగానికి పెద్ద పీట వేశారని చెప్పారు. తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయుల వల్లే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పడు అదే గురువులను సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top