యూనివర్సిటీల యాక్టు సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి సురేష్‌

అసెంబ్లీ: యూనివర్సిటీల నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించి యాక్టులో చిన్న సవరణ తీసుకువస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. యూనివర్సిటీ యాక్టు సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రతిపాదించారు. అనంతరం ఆయన ఏంమాట్లారంటే.. యూనివర్సిటీ యాక్టుకు చిన్న సవరణ తీసుకువస్తున్నాం. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో క్లాస్‌ వన్, క్లాస్‌ 2  రెండు రకాల సభ్యులు ఉంటారు. క్లాస్‌ వన్‌ సభ్యులు అందరూ గవర్నమెంట్‌ అధికారులు.. క్లాస్‌ 2 ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులు ఉంటాయి. వైస్‌ చాన్స్‌లర్‌ కాలపరిమితి, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ కాలపరిమితి పూర్తవుతుందో.. అలాంటి సమయంలో ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సుప్రీం బాడీ. ఎగ్జిక్యూటీవ్‌ కౌన్సిల్‌ ద్వారా యూనివర్సిటీ విధి విధానాలను, రూపకల్పన అవసరం ఉంటుంది. యూనివర్సిటీని కంట్రోల్‌ చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ బాడీ ఉంది. యూనివర్సిటీ యాక్టు సవరణ బిల్లు ద్వారా ఏపీకౌన్సిల్‌ ఫర్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ను ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ఉంచాలని ప్రతిపాదించాం. ఈ నిర్ణయం ద్వారా యూనివర్సిటీల నిర్వహణ బాగా జరుగుతుందని భావిస్తున్నామని విద్యాశాఖ మంత్రి అన్నారు.

 

Back to Top