వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుంది

గత ప్రభుత్వం నిర్వాసితులు గురించి ఆలోచించలేదు

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతిః రెండేళ్లలో చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ఆరు శాతమే పూర్తయ్యాయని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఏపీ శాసన మండలిలో ఆయన మట్లాడుతూ ఈపీసీ నుంచి 60 సి పనులిచ్చే అధికారం ఉందా అని ప్రశ్నించారు.స్పిల్‌వే పనులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. 2018కి గ్రావిటీ ద్వారా నీరు ఇస్తామన్నారు...ఇచ్చారా అని ప్రశ్నించారు.గత ప్రభుత్వం ముంపునకు గురయ్యే 18వేల కుటుంబాల గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలోనే పోలవరం పూర్తవుతుందని తెలిపారు.

పోలవరంను పూర్తిచేసేందుకు మా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. నిర్వాసితులందరికీ పునరావాసం కల్పిస్తామని తెలిపారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు మొదలు ప్రారంభిస్తామన్నారు.బడ్జెట్‌లో పోలవరానికి 5,400 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.అవసరమైతే అధికంగా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top