సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు

సీఎం వైయ‌స్ జగన్‌ దిశానిర్దేశం చేశారు 

వైయ‌స్ఆర్‌‌ కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మిధున్‌ రెడ్డి

న్యూఢిల్లీ: అంత‌ర్వేది ర‌థం ద‌గ్ధం ఘ‌ట‌న‌లో పాటు సీఆర్‌డీఏ, ఫైబర్ గ్రిడ్‌లపై వెంటనే సీబీఐ దర్యాప్తు జరపాల‌ని కేంద్రాన్ని కోర‌నున్న‌ట్లు లోక్‌స‌భ ప‌క్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు.  దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల‌ని పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కోరుతామ‌ని ఆయ‌న చెప్పారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ పూర్తి గౌరవం ఇచ్చింద‌ని, అయితే ఆయన ప్రతిపక్షాల ఎజెండా ప్రకారం నడుచుకుంటున్నార‌ని, ఆయనపై త్వరితగతిన అనర్హత వేటు వేయాల‌ని స్పీక‌ర్‌ను కోరిన‌ట్లు చెప్పారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లు ఆయ‌న‌ తెలిపారు. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  సీఎంతో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు బకాయిలు కేంద్రం నుంచి వచ్చేలా చూడమని చెప్పారు. నిర్వాసితులకు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేలా ఒత్తిడి చేయమని కోరారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును వేగవంతం చేశామ‌న్నారు. ఈ అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామ‌ని చెప్పారు. జీఎస్టీ పెండింగ్ బకాయిలను రాష్ట్రానికి వచ్చేలా అధికారులతో కలుస్తామ‌ని,  గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించిన‌ట్లు తెలిపారు.   

మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరుతాం..

'జనాభా ప్రాతిపదికన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఓ మెడికల్ కాలేజ్‌ పెట్టేలా సీఎం నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం మద్దతు కోరారు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఉంటే గిరిజనులకు లాభం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారు. అంతర్వేది టనపై నిజాలు నిగ్గు తేలాలి. మతకలహాలు రెచ్చగొట్టే ప్రయత్నిస్తున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామ‌ని మిథున్ రెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top