అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు

కావ‌లిలో మేమంతా సిద్ధం స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

మంచి చేసిన మనకు మద్దతిచ్చేందుకు మీరంతా సిద్ధమా

మరో 5 వారాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి

ఇది వైయ‌స్ జగన్‌, చంద్రబాబు మధ్య యుద్ధం కాదు..

పేదల పక్షాన ఉన్న మీ బిడ్డ వైయ‌స్ జగన్‌ ఉన్నాడు..

పెత్తందార్ల పక్షాన ఉన్న చంద్రబాబు ఉన్నాడు..

మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి  జరిగింది

జరిగిన మంచి  కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా 

అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు

చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథం కూడా గుర్తుకురాదు

బాబు పేరు చెప్తే పేదలకు చేసిన మంచి ఒక్కటీ లేదు..

ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో  గుర్తుకొస్తుంది

మేనిఫెస్టో చూపించే దమ్ము, ధైర్యం చంద్రబాబు ఉందా? 

బాబు తన మేనిఫెస్టోలో కనీసం ఒక్క హామీనైనా నెరవేర్చలేదు

చంద్రబాబు మంచి చేసి ఉంటే మూడు పార్టీలతో పొత్తు ఎందుకు?

మోసాలు, వెన్నుపోట్లతో బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నారు

ఇప్పటికీ చేసిన పనులు చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదు..

మీ బిడ్డ ప్రతి ఇంటికి మంచి చేశాడు

రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం

ఒక్కసారి ఆశీర్వదించినందుకే 58 నెలలపాటు సంక్షేమం అందించా

మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం

ఇంటింటికి పౌర సేవలను డోర్‌ డెలివరీ చేయిస్తున్నాం

లంచాలు, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చా

నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చాం

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం..

నేను చేసిన మంచిలో కనీసం 10 శాతమైన బాబు చేశాడా? 

సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలను తీసుకొచ్చాం

ప్రతి గ్రామంలోనూ ఆర్‌బీకే, విలేజ్‌ క్లినిక్స్‌​ పెట్టాం

మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకోచ్చాం

అవ్వాతాతల సంక్షేమం, మహిళా సాధికారత చేసి చూపించాం.. 

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించాం

99 శాతం హామీలు నెరవేర్చి మళ్లీ మీ ముందుకు వచ్చా..

మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి

మరో ఐదేళ్లపాటు మంచి కొనసాగాలంటే తోడుగా ఉండాలి..

ఫ్యాన్‌కు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి జరుగుతుంది.

ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు చెప్పండి 

నెల్లూరు జిల్లా:  అబద్ధాలు, మోసం, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమ‌ర్శించారు. మేనిఫెస్టో కాపీలు  చూపించే దమ్ము, దైర్యం చంద్రబాబుకు ఉందా? అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌వాలు విసిరారు . 30 ఏళ్ల క్రితమే సీఎంగా చేసిన చంద్రబాబు.. నా గతాన్ని చూసి ఓటేయండి అని అడగలేరు. మేనిఫెస్టోలోని 10 శాతం హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రశ్నించారు.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 9వ రోజు శనివారం సాయంత్రం నెల్లూరు జిల్లా కావలి నిర్వహించిన బహిరంగ సభలో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు.    

సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..

కడలి తరంగాన్ని మించిన జనప్రభంజనం.*

మన నెల్లూరు జిల్లాలో మన కావలిలో ఉవ్వెత్తున ఎగిసే కడలి తరంగాన్ని మించిన జనప్రభంజనం ఇసుక వేసినా కూడా రాలనంతగా ఈరోజు నా ఎదుట కనిపిస్తోంది. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, మోసగాళ్ల కూటమికి వ్యతిరేకంగా, పేదల భవిష్యత్తుకు అండగా, ఈ జిల్లా మొత్తం సిద్ధం. సిద్ధం.. అని అంటోంది. 

మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి, ఆ మంచి అందుకున్న కోట్ల ప్రజానీకం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది. అవతలి పక్షంలో తోడేళ్లుగా, మోసగాళ్లుగా ఉంటున్న వాళ్లంతా కూడా కుతంత్రాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. వారి కుతంత్రాలకు, కుట్రలకు మనందరి జైత్రయాత్ర.. వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం.. సిద్ధం.. అంటూ లక్షల సింహాలు గర్జిస్తుంటే వస్తున్న ఆ శబ్ధం సిద్ధం.. సిద్ధం. 

 

 

*వచ్చే 5 ఏళ్లలో మన పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి.* 

వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును, మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్‌ కు చంద్రబాబుకు, మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెబుతున్నాను. ఈ యుద్ధంలో అటువైపున చంద్రబాబు, దత్తపుత్రుడు, వీరిద్దరికీ తోడు.. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లు మాత్రమే సరిపోరు అని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ ఒక జాతీయ పార్టీ అయితే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ మరొక జాతీయ పార్టీ, వీళ్లంతా కూడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అనేక సందర్భాల్లో మన ప్రజలను, పేదలను మోసం చేసిన వ్యతిరేక పక్షం చంద్రబాబునాయుడుగారి పక్షం. 

 

*ధర్మాన్ని గెలిపించి –విశ్వసనీయతను కాపాడేందుకు సిద్దమా?*

మరి ఇలాంటి సందర్భాల్లో మే 13న జరగబోయే సంగ్రామంలో ఇంటింటికీ మంచి చేసిన మనందరి ప్రభుత్వం, మనందరి పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా.. ఇంతకు ముందే నేను చెప్పాను.. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కాదు అని చెప్పి.. ఈ ఎన్నికల్లో మన పార్టీకి, మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, వృత్తి వర్గాలు, మూడు ప్రాంతాలూ.. వీరందరి ప్రయోజనాలను రక్షించుకునేందుకు, జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా కూడా.. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ధర్మాన్ని గెలిపించడం కోసం, విశ్వసనీయతను కాపాడుకునేందుకు మీరంతా.. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. 

 

 

*మోసం, అబద్దాలు, వెన్నుపోటు, కుట్రలు కలిపితే చంద్రబాబు.*

ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు.. ఈ పాత్రలన్నీ కూడా కలిపితే.. అంటే సినిమాల్లో విలన్‌ క్యారెక్టర్‌ లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్‌ గురించి కాస్త మాట్లాడుకుందామా.. 

 

ఆ చంద్రబాబును గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చాను. అయ్యా 14 ఏళ్లు సీఎంగా చేశావు. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా?  అని నేను అడిగాను. నాలుగు నెలలుగా ఇదే అడుగుతున్నాను. మీ ముందే, మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలు లక్షల మంది ముందు ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను.

 

 

*అయినా బాబు సమాధానం చెప్పలేదు..*

మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచైనా, ఒక్క మంచి పథకమైనా, ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పలేదు సరే.. కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అదీ లేదు. 

 

మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగాను. అయ్యా చంద్రబాబూ.. 3 సార్లుముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకొంటావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెప్పుకొంటావు. మరి ఎన్నికల ముందు మూడుసార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు. ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్క సారి అయినా కూడా ఇలా.. నాలా.. పబ్లిక్‌ గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాను అని ఇలా మేనిఫెస్టోను పబ్లిక్‌ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేశావా? నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ..? నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించరు. నాకైతే చూపించలేదు. పోనీ మీకైనా చూపించాడా? అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము, ధైర్యం, నిబద్ధత నీకు ఉందా చంద్రబాబూ? అని అడుగుతున్నాను. 

 

*మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు చేయని బాబు*

నీ మేనిఫెస్టోలో కనీసం 10 శాతం అమలు చేశాను అని చెప్పే ధైర్యం, నిబద్ధత నీకు ఉందా? అని నేను అడిగా. నాకు సమాధానం చెప్పలేదు. పోనీ మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతున్నాను.

ఇంకో ప్రశ్న కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబును అడిగాను. చంద్రబాబూ.. చంద్రబాబూ... మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాను అని చెప్పుకొంటావు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు.. నిజంగా మీ మార్క్‌ అంటూ గ్రామంలోగానీ, పేదల గుండెల్లో గానీ, సామాజికవర్గాల్లో గానీ, అభివృద్ధిలోగానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తు ఎందుకయ్యా చంద్రబాబూ అని నేను అడుగుతున్నాను. 

 

సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా. మీ అందరి ముందూ అడిగా. మరి చంద్రబాబునాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా? అంటే నాకైతే ఇవ్వలేదు. మరి మీకేమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇవ్వడుగాక ఇవ్వడు. అంతే కాదు.. ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగాను.

 

ప్రజలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని వ్యక్తి బాబు అయ్యా చంద్రబాబూ.. చంద్రబాబూ చంద్రబాబూ.. 30 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చావు. వెన్నుపోట్లు పొడిచో, తడిగుడ్డతో గొంతు కోసో, కుట్రలు చేసో, కుతంత్రాలు చేసో, లేదా పొత్తులు పెట్టుకొనో, లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకొనో ఏదోలా మొత్తానికి 30 ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా.. 14 ఏళ్లు మోసాలతో, వెన్నుపోట్లతో ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు, ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను, కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి.. అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను, ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయడం అని ఈ పెద్దమనిషి అడగడు. ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చే సరికే ప్రజల్ని మభ్య పెడుతూ జనం ముందుకొస్తాడు. 

 

నేను అది చేస్తాను. నేను ఇది ఇస్తాను అని చెబుతాడు తప్ప.. తన గతం గురించి చెప్పడు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను, నాకు ఓటేస్తే నేను ఇంటింటికీ బెంజ్‌ కారు కొనిస్తాను, నాకు ఓటేస్తే ముఖ్యమైన హామీలిస్తాను, నాకు ఓటు వేస్తే సూపర్‌ సిక్సు, సూపర్‌ సెవెన్‌. అని ఇలాంటివి మాట్లాడతాడేగానీ, నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పరిపాలన చేశాను, ప్రతి పేదవాడి గుండెల్లో గుడికట్టుకునేట్టుగా ఆ పేదవాడికి ఈ మంచి చేశాను, ఈ మంచి స్కీము తెచ్చాను, దీన్ని చూసి నాకు ఓటు వేయండి అని ఏరోజూ ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు అనరు. 

 

*ప్రజలకు మంచి చేశానని బాబు చెప్పలేడు.*

నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో  ఎన్నో సందర్భాల్లో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది దగ్గర ఇదే ప్రశ్న వేశాను. పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అంటే, దీనికీ చెప్పడు. నాకైతే చెప్పడు. కనీసం మీకైనా చెప్పాడా? అని అడుగుతున్నాను. చెప్పలేదు... చెప్పలేదు అనేదానికన్నా కూడా చెప్పలేడు అనడం కరెక్టు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఎందుకంటే ప్రజలతోనూ, పేదలతోనూ బాబు బంధం అతకని బంధం. అందుకే నోటికి ఆయన ఫెవికాల్‌ వేసుకుంటాడు. నోటికి ఫెవిక్విక్‌ పూసుకుంటాడు. పూసుకుని నోరు మూసుకుంటాడు.

 

మరి మీ బిడ్డ.. మీ జగన్‌.. సిద్ధం సిద్ధం అని సభలు పెట్టి ఏమి చెబుతున్నాడంటే, ఇంటింటికీ మంచి చేస్తూ, ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా ఆ డబ్బులు వివిధ పథకాల ద్వారా వెళ్తున్నాయి.  

 

మీ జగన్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కేవలం 58 నెలలు. ప్రజలు ఒక్కసారి మీ బిడ్డను ఆశీర్వదిస్తేనే ఈ 58 నెలల పరిపాలన తర్వాత అదే ప్రజల ముందు మీ బిడ్డ నిలబడి, మీ జగన్, మీ బిడ్డ ఏం చెబుతున్నాడంటే... ఇంటింటికీ మంచి చేస్తూ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాడు అని మీ బిడ్డ గొప్పగా ఈరోజు మీ ముందు నిలబడి చెప్పగలుగుతున్నాడు.  

 

 

*99 శాతం హామీలు నెరవేర్చి మీ బిడ్డ మీ ఆశీర్వాదం కోరుతున్నాడు*

మీ బిడ్డ ఈరోజు మీ అందరి ముందూ గొప్పగా నిలబడుతూ ఏకంగా మేనిఫెస్టో అన్నది ఒక పవిత్ర గ్రంథం, ఎన్నికలప్పుడు మనం ఏవైతే హామీలిస్తామో.. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి చెత్తబుట్టలో కాదు వేయాల్సింది. ఆ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్‌ గా, బైబిల్‌ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చి మీ బిడ్డ మళ్లీ మీ ముందుకు వచ్చి ఇదిగో మేనిఫెస్టో ఇదిగో 99 శాతం హామీలు నెరవేర్చిన మీ బిడ్డ అని మళ్లీ మీ అందరి ఎదుట  నిలబడి ఆశీస్సులు కోరుతున్నాడు. 

 

ఇంటింటికీ కూడా పౌర సేవలు డోర్‌ డెలివరీ చేయిస్తున్నాడు. అది పెన్షన్‌ కావచ్చు, రేషన్‌ కావచ్చు,లేదా వివిధ పథకాలు కావచ్చు, లేదా బర్త్‌ సర్టిఫికెట్, కులధృవీకరణ సర్టిఫికెట్‌ కావచ్చు.. ఏదైనా కూడా మీ బిడ్డ.. మీ ఇంటి వద్దకే వచ్చే పౌర సేవలను ఇంటింటికీ పంపిస్తున్నాడు.  

 

*లంచాలు, వివక్ష లేని వ్యవస్ధను తెచ్చాం.*

మీ జగన్‌ ఓ లంచాలు లేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు. ఎక్కడా ఎవరూ లంచాలు అడగడం లేదు.ఎక్కడా ఎవరూ వివక్ష చూపించడం లేదు. మీ జగన్‌ కు గత ఎన్నికల్లో ఓటు వేయిన వారైనా సరే అర్హత ఉంటే చాలు వారికి కూడా మంచి చేసే కార్యక్రమం జరుగుతున్నది కేవలం మీ బిడ్డ హయాంలోనే. ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని వ్యవస్థ తీసుకొచ్చాడు మీ జగన్‌. గ్రామాల్లో మన స్కూళ్లను మార్చాడు మీ జగన్, గ్రామాల్లో మన హాస్పటళ్లను, గ్రామాల్లో మన వ్యవసాయం మార్చాడు. సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ జగన్‌. అవ్వాతాతల సంక్షేమం, అక్కచెల్లెమ్మల సాధికారత అంటే ఇదీ అని చేసి చూపించాడు మీ జగన్, మీ బిడ్డ అని ఈ సందర్భంగా గర్వంగా చెబుతున్నాను. 

మరి 14 ఏళ్లు చంద్రబాబు నాయుడుగారు ముఖ్యమంత్రిగా చేశారు కదా.. మరి జగన్‌ చేసిన దాంట్లో, మీ బిడ్డ చేసిన దాంట్లో కనీసం 10 శాతం అయినా కూడా నేను చేశాను అని ఇదే చంద్రబాబునాయుడు గారు గుండెల మీద చేయి వేసుకుని ధైర్యంగా నిబద్ధతో చెప్పగలడా అని అడుగుతున్నాను.

 

*గ్రామాన్నే మార్చే వ్యవస్ధ.*

జగన్‌ ఒకవైపున సిద్ధం సభలు పెట్టి ఏ గ్రామానికైనా కూడా 7 వ్యవస్థలు. ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం ఆర్బీకే వ్యవస్థ, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థ, ఇంగ్లీషు మీడియం, నాడునేడుతో మారిన మన గవర్నమెంట్‌ బడులు, ప్రతి గ్రామంలో ఓ మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, అదే గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీ, ఓ లంచాలు లేని, వివక్ష లేని పాలనతో గ్రామాన్నే మార్చిన వ్యవస్థ తీసుకొచ్చానని మీ బిడ్డ ధైర్యంగా చెబుతున్నాడు.

 

*కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకొన్నా...*

నేను అడుగుతున్నాను, ఏ గ్రామమైనా తీసుకోండి. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం. ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెబుతున్న ప్రతి మాటా కూడా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. అదే గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థ, ఇంటికే వచ్చే వాలంటీర్‌ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్, మారిన ఇంగ్లీషు మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా  ఏ గ్రామాన్ని తీసుకున్నా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే అందజేస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్‌ చెల్లెమ్మలు, తమ్ముళ్లు.. వీరందరికీ పైన మీ బిడ్డ జగన్‌ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తున్నాడు. 

 

అందుకే మీ బిడ్డ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు.

అందుకే మీ జగన్‌ ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. రైతులకు ఇవి చేశాను, అక్కచెల్లెమ్మలకు ఇవి చేశాను, అవ్వాతాతలకు ఇవి చేశాను, చిన్నారులకు ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశానంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాను, ప్రతి గడపకూ ఏమి చేశాను అని పదే పదే వివరిస్తున్నాడు మీ జగన్, మీ బిడ్డ. ధైర్యంగా చేశాం కాబట్టే, నిబద్ధతతో చేశాం కాబట్టే, ప్రతి ఇంటికీ మంచి చేశాం కాబట్టే మీ బిడ్డ ఇలా ధైర్యంగా మీ ముందు నిల్చుని చెప్పగలుగుతున్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతున్నాడు. మీ బిడ్డ ప్రతి చోటా కూడా చెబుతున్నాడు. చేసిందే చెబుతున్నాడు. పేదల భవిష్యత్‌ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెబుతున్నాడు.

 

*మరో 5 ఏళ్లు ఈ మంచి కొనసాగాలంటే..*

ఈరోజు మంచి జరిగింది. ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్లీ కొనసాగాలంటే జరుగుతున్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నాను. మీరు వేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతున్నా, నేను చెబుతున్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ మీ ఇళ్లకు వెళ్లండి. మీరంతా మీ ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలతో, ఇల్లాలితో, అవ్వాతాతలతో, చిన్న బిడ్డలు, పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదని వాళ్లతో మాట్లాడకుండా పోవద్దు. చిన్న పిల్లతో కూడా మాట్లాడండి. చర్చించండి. ఎవరి వల్ల మేలు జరిగింది? ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని కోరుతున్నాను. 

 

*ఫ్యానుకు ఓటేయమని ప్రతి ఒక్కరికీ చెప్పండి.*

ఈ విషయం ప్రతి ఒక్కరికీ కూడా చెప్పాలి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. వెళ్లి ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు, కుటుంబాలు బాగుపడతాయన్నది ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. ఫ్యానుకు రెండు ఓట్లు వేస్తేనే ఇంటింటికీ   అభివృద్ధి జరుగుతుందని చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఎవరైనా నమ్మారు అంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని.. కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడుగారిని నమ్మడం అంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకీ వెళ్లి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి, వారంతా గతంలో ఏం చెప్పారు? ఏం చేశారో కూడా వివరించండి. 

 

*ఒక్కసారి 2014 ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి వెళ్దామా?*

2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు.. ఇంటింటికీ పంపించిన పాంప్లెట్‌ ఇది. గుర్తుందా ఈ పాంప్లెట్‌. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. చంద్రబాబు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికీ పంపించాడు ఈ పాంప్లెట్‌. ఇందులో మోడీగారి ఫొటో ఉంది, దత్తపుత్రుడి ఫొటో, చంద్రబాబు నాయుడు ఫొటో ఉంది. కింద చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది. ప్రతి టెలివిజ్‌ లోనూ వాళ్ల ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో అడ్వటైజ్‌ మెంట్లు ఊదరగొడుతూ అడ్వటైజ్‌ మెంట్లు ఇచ్చారు. ముఖ్యమైన హామీలంటే ఏం రాశారో తెలుసా? చెప్పమంటారా? 

 

*చంద్రబాబు విఫలహామీలు....*

రైతులకు రుణ మాఫీపైమొదటి సంతకం చేస్తానన్నాడు. రూ.87,612 కోట్ల రుణ మాఫీ చేశాడా? రెండో ముఖ్యమైన హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. మరి రూ.14,205 కోట్లు.. కనీసం ఒక్క రూపాయి అయినా ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణాల మాఫీ చేశాడా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. మూడో ముఖ్యమైన హామీ.. ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్‌ చేస్తామన్నాడు. మీకు ఆడబిడ్డలుపుట్టారు కదా.. 2014–19 మధ్యలో. మీ పక్కన చుట్టుపక్కల వాళ్లకైనా పుట్టారు కదా.. కనీసం ఒక్కరికైనా.. రూ.25 వేలు కథ దేవుడెరుగు. కనీసం ఒక్క రూపాయి అయినా వేశాడా? అని అడుగుతున్నాను. 

 

*నాలుగో ముఖ్యమైన హామీ..* 

ఇంటింటికీ ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికీ రూ.2 వేల నిరుద్యోగభృతి అన్నాడు. 5 ఏళ్లు అంటే 60 నెలల్లో 2 వేల చొప్పున రూ.1.20 లక్షలు. ఇచ్చాడా? మరో ముఖ్యమైన హామీ.. అర్హలులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. కనీసం ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్‌ అన్నాడు, చేనేత పవర్‌ లూమ్స్‌ రుణాలు మాఫీ అన్నాడు. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ ఓ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ కావలిలో ఏమన్నా కనిపిస్తోందా? 

 

మరి నేను అడుగుతున్నాను. మరి 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ప్రతి ఇంటికీ ఆ పాంప్లెట్‌ పంపించి ముఖ్యమైన హామీలు అంటూ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చాడా? అని మిమ్మల్నందరినీ అడుగుతున్నా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? అని అడుగుతున్నాను. మరి నేను ఒక్కటే మిమ్మల్నందరినీ అడుగుతున్నాను. మరి ఇదే కూటమి మళ్లీ ఇప్పుడు ఇదే చంద్రబాబు, ఇదే మోడీగారు, ఇదే దత్తపుత్రుడు.. ఇదే ముగ్గురి ఫొటోలతో మళ్లీ ఇవాళ చంద్రబాబు నాయుడు సంతకం పెట్టి కొత్త మేనిఫెస్టోతో రంగురంగుల హామీలతో మేనిఫెస్టో అంటున్నాడు. ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తామంటున్నాడు. నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తానంటాడు. నమ్ముతారా? సూపర్‌ సిక్స్‌ అంటున్నాడు. సూపర్‌ సెవెన్‌ అంటున్నాడు. నమ్ముతారా? 

 

 

*బాబును నమ్మితే పులి– బంగారు కడియం కథే*

చంద్రబాబునాయుడును నమ్మితే మాత్రం బంగారు కడియం, పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్‌ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. మరి సిద్ధమే అయితే, వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులోంచి సెల్‌ ఫోన్‌ బయటకు తీయండి. అందులో లైట్‌ బటన్‌ నొక్కండి. ఆన్‌ చేయండి. ఆన్‌ చేసి పేదల భవిష్యత్తు కోసం యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. 

 

*విశ్వసనీయతకు– వంఛనకు మధ్య జరుగుతున్న యుద్ధం.*

ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి, వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, హాస్పటళ్లు బాగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తుమీద రెండు బటన్లు నొక్కాలి.

 

175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతున్నా. మనం వేసే ఓటు రాబోయే 5 సంవత్సరాల మన తలరాతలు ఎలా ఉంటాయన్నది నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలు చేసి, ఎవరి వల్ల మంచి జరిగింది, ఏ ప్రభుత్వం కొనసాగితే మంచి జరుగుతుందన్న ఆలోచనతో ప్రతి అడుగూ వేయండని కోరుతున్నాను. 

 

 

*మన అభ్యర్ధులను పరిచయం చేస్తున్నా – ఆశీర్వదించండి.*

ఈరోజు మీ అందరికీ కూడా మన ఎంపీ అభ్యర్థులను, మన ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేస్తున్నాను. 

మీ అందరి చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు మన ఎంపీ అభ్యర్థుల మీద, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉంచవలసిందిగా కోరుతున్నాను. నా ముందు సాయన్న నిల్చుని ఉన్నాడు. మన పార్టీ ఎంపీ అభ్యర్థిగా తాను నిల్చోబోతున్నాడు. మంచి వాడు సౌమ్యుడు. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే నాకు అత్యంత సన్నిహితుడు కూడా. మీ ప్రాంతానికి మంచి చేస్తాడు. మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. సాయన్నను గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను. 

 

అదే విధంగా మీ కావలి నుంచి మీ అందరికీ పరిచయస్తుడు, ప్రతాప్‌ అన్న నా పక్కనే నిల్చుని ఉన్నాడు. మంచి వాడు, సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ప్రతాప్‌ అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.

అదేవిధంగా నెల్లూరు రూరల్‌ నుంచి ఆదాల ప్రభాకరన్న నిల్చోబోతున్నాడు. తాను కూడా మంచి వాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ప్రభాకరన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. 

 

కొవ్వూరు నుంచి మీ అందరికీ పరిచయస్తుడు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన వాడు. ప్రసన్న అన్న నా పక్కనే ఉన్నాడు. ప్రసన్నను మంచి మెజార్టీతో, గొప్ప మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను.

నెల్లూరు సిటీ నుంచి ఒక సామాన్యుడు. మీలో ఒకడు,  ఖలీల్‌ ను నెల్లూరు సిటీ నుంచి అభ్యర్థిగా నిలబెడుతున్నాను. మీ అందరిచల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు అతి సామాన్యమైన ఖలీల్‌ పై గొప్పగా, గట్టిగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. 

 

ఉదయగిరి నుంచి రాజగోపాల్‌ అన్నను నిల్చోబెడుతున్నాం. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు అన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

ఆత్మకూరు నుంచి విక్రమ్‌ నిలబడుతున్నాడు. విక్రమ్‌ వాళ్ల అన్న గౌతమ్‌.. తనకు నాకు మధ్య ఉన్న స్నేహం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేనిది. గౌతమ్‌ తమ్ముడిగా విక్రమ్‌ ఈ రోజు జనరల్‌ ఎలక్షన్స్‌లో నిలబడుతున్నాడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు విక్రమ్‌ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. 

 

కందుకూరు నుంచి మధుసూదన్‌ యాదవ్‌ నిలబడుతున్నాడు. మంచి వాడు, సౌమ్యుడు. మంచివాళ్లలో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మధు అన్నపై సంపూర్ణంగా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. 

 

ఇంకా చీకటి పూర్తిగాపడలేదు కాబట్టి ఒక్కసారి అంతదాకా వచ్చి మీ అందరికీ మళ్లీ నమస్కారం పెట్టి మళ్లీ వెనక్కి వచ్చేస్తా. మన గుర్తు ఇది. అక్కా మన గుర్తు ఇది. అవ్వా మన గుర్తు ఇదీ. ఫ్యాను గుర్తు మన గుర్తు. ఎవరైనా అక్కడో ఇక్కడో మర్చిపోయి ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. మన భవిష్యత్తు మార్చేది ఈ ఫ్యానే అని గుర్తుపెట్టుకోండి. అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Back to Top