లోకేష్‌ పీఆర్‌ స్టంట్‌ బయటపడింది

లోకేష్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్చలేదో చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి మార్గాని భరత్‌

 తూర్పుగోదావరి: రాష్ట్ర విద్యా వ్యవస్థపై గొప్పగా మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌.. తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చదివించడం లేదో సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉందని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారో, ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన పట్టాలపై టీడీపీ నేతలు అప్పట్లో అనేక ఆరోపణలు చేశారని, అవి దొంగ పట్టాలైతే వాటిని జారీ చేసిన అధికారులపై, సంబంధిత ప్రభుత్వ శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని భరత్‌ ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పట్టా కూడా ఎందుకు ఇవ్వలేకపోయిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన పట్టాలను సరెండర్‌ చేసుకునేందుకు ఇప్పుడు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాలు తీసుకోవడంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, పేదల ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని మార్గాని భరత్‌ కోరారు.

Back to Top