చంద్ర‌బాబు పాపం పండే రోజు వ‌స్తుంది

మాజీ మంత్రి ఆర్కే రోజా

చిత్తూరు:  అక్రమ మద్యం కేసులో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేయ‌డం ప‌ట్ల మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. అధికార బ‌లంతో చంద్ర‌బాబు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను అక్ర‌మ‌ కేసుల‌తో వేధిస్తున్నార‌ని, ఆయ‌న పాపం పండే రోజు కూడా వ‌స్తుందని ఆమె హెచ్చ‌రించారు. ఈ మేర‌కు రోజా త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా ఆర్కే రోజా..

ఏడాది పాలనలో చంద్ర‌బాబు  చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన  పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది.  ఎంపీ మిధున్‌రెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తున్నా.

 

Back to Top