తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై విజయసాయిరెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ గారి సమర్థ నాయకత్వంలో మరింత పటిష్ట పరుద్దామని సూచించారు. విజయసాయిరెడ్డిని కలిసిన వారిలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, తదితరులు ఉన్నారు.