ప‌వ‌న్ టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు  

తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి
 

విజయవాడ:  చంద్ర‌బాబు లాగే ఇటువంటి హీనరాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్‌ కల్యాణ్‌ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి హెచ్చ‌రించారు.  మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిప‌డ్డారు.  మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు అంటూ  ఫైర్‌ అయ్యారు. పోసాని మురళి భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా ఉండటం మానవత్వం కాదు. నీచ నికృష్ట రాజకీయ చదరంగం ప్రారంభించి, చివరకు సంస్కార హీనుల్ని తయారుచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగుదేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెప్తాడు' అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top