ఈ నెల 28న వైయస్‌ఆర్‌సీపీలో చేరుతా

కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి

మాట తప్పని..మడమ తిప్పని నేత వైయస్‌ జగన్‌

కాంగ్రెస్, టీడీపీ పొత్తును వ్యతిరేకించాను

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాట మార్చారు

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కొద్దిసేపటి క్రితం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం  ఇష్టం లేక ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, మళ్లీ రాజన్న రాజ్యం వైయస్‌ జగన్‌తోనే వస్తుందన్నారు. అందుకే వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 28న అమరావతిలో వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతానని కిల్లి కృపారాణి తెలిపారు. బీసీ గర్జనలో వైయస్‌ జగన్‌ఇచ్చిన హామీలు నచ్చాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మాట తప్పరని, మడమ తిప్పని నేత అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు. బీసీలను వాడుకొని చంద్రబాబు వదిలేశారని ధ్వజమెత్తారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలు విశ్వసించరని చెప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top