వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం

 తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం

తాడేప‌ల్లి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరగనుంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

ప్రజా సమస్యలపై శాసనసభ, శాసన మండలిలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై శ్రీ వైయస్‌ జగన్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించి, ప్రజల పక్షాన వైయస్సార్‌సీపీ చేపట్టాల్సిన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నారు.
 

Back to Top