వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు ప్రతిఒక్కరూ నడుంబిగించాలి

గురజాల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి

జగనన్న వస్తున్నాడు..రెండు వేల పెన్షన్‌ మూడువేలు అవుతుందని ప్రతి ఇంటికి చెప్పండని గురజాల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్‌ రెడ్డి పిలుపునిచ్చారు.20 రోజులు ఓపిక పట్టండి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని,రాష్ట్రానికి పట్టిన శని వదలుతుందని తెలిపారు.ప్రతిఒక్కరూ నడుంబిగించి ౖవైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు కృషిచేయాలన్నారు, సామాన్యులు, డబ్బులేకపోయిన ఎంపీ అభ్యర్థి సురేష్,ఎమ్మెల్యేఅభ్యర్థిగా నాగార్జునలను ప్రకటించిన ఘనత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 20 రోజుల్లో అన్న వస్తాడు ప్రతి అక్కాచెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తాడని చెప్పండన్నారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి,దోపీడీలకు పాల్పడిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు 20 రోజుల్లో చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. 

Back to Top