కాకినాడ: కాకినాడ సెజ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకకరించిన తమ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడారని పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్భందాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురి చేశాడని మండిపడ్డారు. పచ్చని పొలాలతో ఉన్న తమ ప్రాంతంలో పరిశ్రమల పేరుతో భూసేకరణను ప్రారంభించిన చంద్రబాబు ఆ తరువాత ఇక్కడి రైతులపై ప్రదర్శించిన దౌర్జన్యాలు, దాష్టీకంను గుర్తు చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సెజ్ బాధిత రైతులకు అండగా ఉంటానంటూ మోసపూరితమైన మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత సీఎంగా తన నిజ స్వరూపాన్ని చూపించిన చంద్రబాబు నైజంను రైతులు మీడియా ముఖంగా ఎండగట్టారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపి వంగా గీతలతో కలిసి రైతులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... ప్రతిపక్ష నేతగా ఆనాడు ఈ ప్రాంతానికి వచ్చిన జగన్ గారు మా కష్టాలను విని వెంటనే పీఠాపురం సభలో మాకు హామీ ఇచ్చారు. సీఎంగా అధికారంను చేపట్టిన తరువాత ఒక కమిటీని వేసి బలవంతంగా భూములు తీసుకున్న సెజ్ నుంచి తిరిగి మాకు మా భూములను ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులపై ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించారు. రైతుల కుటుంబాల్లో మళ్లీ సంతోషం వచ్చింది అంటే అది సీఎంగా ఆనాడు జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు వల్లే జరిగింది. వైయస్ జగన్ గారి మీద ఆరోపణలు దారుణం: భావిశెట్టి నారాయణస్వామి, కొత్తపల్లి మండలం రావివారిపోడు గ్రామం కాకినాడలో పరిశ్రమల పేరుతో భూసేకరణను ప్రారంభించిందే చంద్రబాబు. సీఎంగా ఉండి ఎపిఐఐసికి భూములను కట్టబెట్టాడు. తరువాత ప్రతిపక్ష నేతగా మా వద్దకు వచ్చి ఇది అన్యాయం అంటూ రైతులను మభ్య పెట్టే మాటలు మాట్లాడాడు. తిరిగి 2014లో అధికారంలోకి రాగానే తన నిజస్వరూపం చూపించాడు. ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలను నిజం చేస్తాడని నమ్మి సీఎంగా అధికారం చేపట్టిన తరువాత కలిస్తే మాట మార్చేశాడు. మరిన్ని భూములను సేకరించేందుకు ప్రయత్నించాడు. వ్యతిరేకించిన మాపై తప్పుడు కేసులు పెట్టించాడు. మా చుట్టూ పోలీసులను ఉంచి, నిర్భందంలోకి నెట్టేశాడు. వైయస్ జగన్ గారి వల్లే మాకు న్యాయం జరిగింది. పాదయాత్రలో మా కష్టాలు విని ఆయన స్పందిచారు. అధికారంలోకి రాగానే కమిటీ వేసి, మాకు తిరిగి భూములు దక్కేలా కృషి చేశారు. అటువంటి వైయస్ జగన్ గారి మీద ఆరోపణలు దారుణం. రైతులుగా ఆ ఆరోపణలను ఖండిస్తున్నాం. చంద్రబాబు దళారీలు భూములు సెజ్ కు ఇవ్వాలని వత్తిడి చేశారు: రైతు ప్రసాద రెడ్డి, నాగులాపల్లి గ్రామం. కాకినాడ సెజ్ కు భూములు ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు కోసం పనిచేసే దళారీలు రైతులపై వత్తిడి తెచ్చారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో మా గ్రామాల్లోపోలీస్ నిర్భందం పెరిగింది. భూములు ఇవ్వని రైతులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేరశారు. కేవీ రావు సెజ్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడతానంటూ రైతులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. పదివేల ఎకరాల్లో పరిశ్రమలు అంటూ ప్రజంటేషన్ ఇచ్చాడు. ఆనాడే కేవీ రావు ఆర్థిక సామర్థ్యంపై రైతులకు సందేహం కలిగింది. చివరికి మా భూములను తీసుకుని, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లాధి రూపాయలు దండుకున్నాడు. 2019లో వైయస్ జగన్ గారు సీఎం అయిన తరువాత సెజ్ కు భూములు ఇవ్వని వారికి న్యాయం జరిగింది. జగన్ గారి వల్లే మా కుటుంబాల్లో వెలుగులు: చింతా సూర్యనారాయణమూర్తి, సెజ్ పోరాట కమిటీ చైర్మన్ మా కుటుంబాలకు చక్కని వెలుగును ఇచ్చిన ఆనాటి సీఎం వైయస్ జగన్ గారికి కృతజ్ఞతలు. చంద్రబాబు వల్ల కాకినాడ సెజ్ భూముల రైతులు అనేక కష్టాలు పడ్డారు. అప్పటి తెలుగుదేశం నాయకుడు యనమల రామకృష్ణుడు సైతం సెజ్ పరిధిలోని గ్రామాలకు వచ్చి రైతులకు భూములు ఇవ్వాలంటూ వత్తిడి చేశాడు. ఆనాడు సెజ్ వల్ల రైతులకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత తన మాటలను ఎందుకు నిలబెట్టుకోలేదు? కనీసం 2013 భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వమని కోరినా కనికరించలేదు. కాకినాడ సెజ్ అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలి. ఆనాడు మూడు లక్షలకే కారు చౌకగా భూములను కొట్టేశారు. ఇప్పుడు అవే భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. జగన్ గారి వల్లే ఈ ప్రాంత రైతులకు న్యాయం జరిగింది. ఎకరానికి రూ.50 వేలు కౌలు వస్తోంది : కృష్ణారెడ్డి, నాగులాపల్లి గ్రామ రైతు కాకినాడ సెజ్ కింద నాకు ఉన్న ఎనిమిది ఎకరాలను లాక్కున్నారు. పూర్తిగా నష్టపోయాను. జగన్ గారు సీఎంగా తిరిగి రైతులకు భూములు ఇవ్వాలని నిర్ణయం చేయడం వల్ల ఇప్పుడు దాదాపు నాలుగు కోట్లరూపాయల విలువైన నా భూమి నాకు దక్కింది. ఎకరానికి యాబై వేల రూపాయల కౌలు నాకు వస్తోంది. దీని అంతటికి కారణం వైయస్ జగన్ గారు చేసిన సాయమే. నా తండ్రిని చంద్రబాబు 200 రోజులు జైలులో పెట్టారు: సత్యానందరెడ్డి, రమణక్కపేట గ్రామం కాకినాడ సెజ్ కు భూములు ఇవ్వమూ అని చెప్పినందుకు వ్యవసాయం చేసుకునే రైతు అయిన నా తండ్రిని చంద్రబాబు 200 రోజులు జైలులో పెట్టాడు. నా మీద రౌడీషీట్ పెట్టి వేధించారు. తొమ్మిది లక్షలకే ఎకరం ఇస్తామన్న నా భూమి ఇప్పుడు ఎకరం కోటి రూపాయలు పలుకుతోంది. జగన్ గారి వల్లే మాకు న్యాయం జరిగింది. ఈనాడు పై నమ్మకం పోయింది: ధర్మరాజు, పొన్నాడ సర్పంచ్ నేను నిత్యం ఈటివిలో న్యూస్ చూస్తాను. సెజ్ కోసం పోరాడిన రైతులపై చంద్రబాబు చేసిన మోసం. జగన్ గారు సీఎంగా చేసిన సాయం ఎంటో నాకు తెలుసు. అలాగే జగన్ గారి ప్రభుత్వం భూములను తిరిగి రైతులకు ఇచ్చేసిన తరువాత వాటిని అమ్ముకున్నారు. ఎవరికైనా అవసరం వస్తే పొలం అమ్ముకోవడం సహజం. అలాగే ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవడం కూడా సహజమే. వాటిపై ఈనాడు పత్రికలో వచ్చిన తప్పుడు రాతలు చూసిన తరువాత ఈనాడుపై ఉన్న నమ్మకమే పోయింది. వీరు చెప్పేవి, రాసేవి అన్ని దొంగ రాతలే అని అర్థమయ్యింది. చంద్రబాబు పెట్టించిన పోలీస్ కేసులతో కుటుంబం గడవడమే కష్టమైంది: - మేడిబోయిన కృష్ణ, మూలపాడు గ్రామం భూముల కోసం మేం చేసిన పోరాటంపై చంద్రబాబు పోలీసులతో పెట్టించిన తప్పుడు కేసుల వల్ల మా కుటుంబం గడవడమే కష్టమైంది. మా నాన్న గారితో పాటు అందరిపైనా తప్పుడు కేసులు పెట్టి, భూములు ఇవ్వాలని బెదరించారు. అయినా కూడా మేం భయపడకుండా పోరాడాం. జగన్ గారి దయ వల్ల తిరిగి మా భూములు మాకు లభించాయి. ఇప్పుడు ఆ భూములు అయిదుకోట్లు ధర పలుకుతున్నాయి. ఇదంతా జగన్ గారు పెట్టిన భిక్ష. జగన్ గారు మా గ్రామాలకు భగవంతుడితో సమానం: బోణం రాములు, పొన్నాడ గ్రామం సెజ్ పేరుతో మా ప్రాంతంలో చంద్రబాబు చేసిన అరాచకం నుంచి విముక్తి ఎప్పుడా అని భగవంతుడిని ప్రార్థించాం. చివరికి జగన్ గారి దయ వల్ల మా ప్రార్థనలు ఫలించాయి. మా భూములు మాకు తిరిగి దక్కాయి. ఈ రోజు మా భూములకు మంచి విలువ లభిస్తోంది. జగన్ గారు మా గ్రామాలకు భగవంతుడితో సమానం. జగన్ గారి రుణం జన్మజన్మలకు తీర్చుకోలేము- చింతపల్లి బుచ్చిరెడ్డి, నాగులపల్లి జగన్ గారికి నమస్కారం. ఆయనకు పాదాభివందనం. ఈ రోజు మా భూమి ఎకరం యాబై లక్షలు చేస్తుంది. ఇతంతా ఆయన వల్లే ఆయన రుణం జన్మజన్మలకు తీర్చుకోలేము. ఇదే మీడియా సమావేశంలో వైయస్ఆర్ సిపి నేతలు మాట్లాడుతూ... కురసాల కన్నబాబు కామెంట్స్: తెలుగుదేశంకు అంటకాగుతున్న ఎల్లో మీడియా దుర్మార్గమైన ప్రచారం చేస్తోంది. కాకినాడ రైతుల కోసం రాజీలేని పోరాటం చేసింది వైయస్ఆర్ సిపి. దేశంలో ఎక్కడా లేని విధంగా సెజ్ కోసం ఇచ్చిన భూములను తిరిగి రైతులకు ఇప్పించిన చారిత్రాత్మక పరిణామం జరిగింది వైయస్ఆర్ సిపి ప్రభుత్వంలో. రైతుల పట్ల ప్రేమతో, ఇచ్చిన మాటకు కట్టుబడి 2180 ఎకరాల భూమిని సెజ్ నుంచి విడిపించి, రైతులకు అప్పగించిన గొప్ప నాయకుడు వైయస్ జగన్. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబుకు వంత పాడే ఈనాడు పత్రిక అబద్దాలే పరమావధిగా తప్పుడు కథనాలను ప్రచురించి తన దిగజారుడుతనంను చాటుకుంది. 2003లోనే కాకినాడ భూములపై కన్నేసిన చంద్రబాబు: కన్నబాబు ఆరోపణ సీఎంగా 2003లోనే పచ్చని పంటలతో కళకళలాడుతున్న కాకినాడ భూములపై చంద్రబాబు కన్నేశాడు. ఈ ప్రాంతంలో పరిశ్రమలను తీసుకువస్తానంటూ ఎపిఐఐసి పేరుతో భూసేకరణ ప్రారంభించాడు. చంద్రబాబుకు బినామీగా ఉన్న కేవీ రావు ఆనాడు భూసేకరణలో కీలక పాత్ర పోషించాడు. రైతులకు ఎకరం మూడు లక్షల రూపాయల కారుచౌక ధరతో వేలాది ఎకరాలను సేకరించాడు. పరిశ్రమలు స్థాపిస్తానని చెప్పి కనీసం ఒక్క సంస్థను కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు రైతుల నుంచి ఎకరం మూడు లక్షలకు భూమిని తీసుకుని, అదే భూమిని ఎకరం ఆరు లక్షలకు బ్యాంకుల్లో తనాఖా పెట్టి కోట్లాధి రూపాయలను దండుకున్నాడు. ఈ దందాలో నష్టపోయింది రైతులే. కోట్ల రూపాయలు పలికే వారి భూములను కారు చౌకగా సెజ్ పేరుతో కొట్టేసిన కేవీ రావుకు చంద్రబాబు బలమైన మద్దతుదారు. కేవీ రావు భూదందాపై విచారణ జరపాలి: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చంద్రబాబు బినామీ కేవీ రావు ఈ ప్రాంతలో కారుచౌకగా భూములను కొని తర్వాత విక్రయించి వందల కోట్లు లాభం ఆర్జించారు. రైతులకు పరిహారం ఇవ్వకుండానే కేవీ రావు వారి భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లబ్ధిపొందారు. జీఎంఆర్ సంస్థ కూడా పలు ఫైనాన్సింగ్ సంస్థల నుంచి రైతుల భూముల మీద రుణాలుగా తీసుకుంది. రైతులకు అండగా నిలిచింది వైయస్ జగన్ గారు: మాజీ ఎంపి వంగా గీత పాదయాత్ర సందర్భంగా రైతులు వైయస్ జగన్ గారిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న నేపథ్యంలో వారికి అండగా ఉంటానని ఆనాడు పిఠాపురం సభ సాక్షిగా హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేందుకు జీఓలు జారీ చేశారు. రైతుల జీవితాల్లో చీకట్లు నింపింది చంద్రబాబు అయితే, వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది వైయస్ జగన్ గారు. ఇది చారిత్రాత్మక పరిణామం. సుప్రీంకోర్ట్ లో పదిహారు రాష్ట్రాల నుంచి సెజ్ లకు వ్యతిరేకంగా నమోదైన కేసుల్లోనూ ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను కోట్ చేస్తున్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలా సెజ్ కు ఒకసారి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వడం జరగలేదు. రైతుల పట్ల జగన్ గారికి ఉన్న ఆదరణ అలాంటిది.