టెరరిస్టులకు డేటా  అమ్మే అవకాశం ఉంది

ఆడపిల్లల జీవితాలతో టీడీపీ ఆడుకుంటుంది

ట్రాకింగ్‌ ద్వారా ఫోన్‌లో డేటాను కూడా డిలీట్‌ చేస్తున్నారు

ప్రజల వివరాలన్నీ చంద్రబాబు ముఠా దగ్గర ఉన్నాయి

సిట్‌ విచారణలో ఏం తేలిందో సుబ్రహ్మణ్యం వివరణ ఇవ్వాలి

డేటా చోరీపై సమగ్ర విచారణ జరగాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్‌: వ్యక్తి సమాచారాన్ని దొంగలించి ఆడపిల్లలు, మహిళలతో తెలుగుదేశం పార్టీ ఆడుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దొంగలించిన డేటాను టె్రరరిస్టులకు అమ్మే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు, లోకేష్‌ల బినామీ అశోక్‌ దాకవరానికి ఏపీ సర్కార్‌ భద్రత కల్పిస్తూ దాచేసిందన్నారు. చంద్రబాబు దుర్మార్గాలపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..

ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన ప్రైవేట్‌ డేటాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ దొంగలించడం ప్రధాన సమస్య. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలోని స్తీ్రలకు సంబంధించిన వివరాలు తెలుగుదేశం పార్టీ గుండాల వద్ద ఉన్నాయి. ఆడపిల్లల ఫోన్‌ నంబర్లు, ఆధార్‌కార్డు నంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు చంద్రబాబు పార్టీ దొంగల ముఠా వద్ద ఉన్నాయని మనం గమనించాలి. డేటా మొత్తం కూడా ఆధార్‌కార్డుకు సంబంధించి ఆధార్‌ డేటాలో ఈ ప్రగతి అని ఏపీ ప్రభుత్వం డెవలప్‌చేసిన ఈ ప్రగతి ఆధార్‌కార్డుకు అనుసంధానం చేశారు. జే. సత్యనారాయణ అనే వ్యక్తిని 7 సెప్టెంబర్‌ 2016లో ఆధార్‌కార్డు చైర్మన్‌గా ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఎన్నికల వరకు ఆధార్‌ డేటా ఈ ప్రగతికి లింక్‌ చేసి సంక్షేమ పథకాలతో డేటా లీక్‌ చేశారు. యూఏడీ దగ్గర ఉన్న డేటాను ఈ ప్రగతికి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఆ డేటాను సాఫ్ట్‌వేర్‌ ద్వారా కన్వర్ట్‌ చేసుకొని ఈ ప్రగతి నుంచి సేవా మిత్రకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. సేవా మిత్ర అనేది టీడీపీకి సంబంధించిన యాప్‌. డేటాను దొంగలించి తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది. 

డేటా ఆరు కోట్లకు సంబంధించిన వివరాలు. ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను చంద్రబాబు తన యాప్‌లో పెట్టుకున్నాడు. డేటా ఇప్పటికీ ఎవరి చేతుల్లో ఉంది అనే దానిపై విచారణ జరగాలి. సేవా మిత్ర యాప్‌ ఐటీ గ్రిడ్స్‌ ఓనర్‌ అశోక్‌ దాకవరం చేతుల్లో ఉంది. ఈ రోజుకూ తెలంగాణ ప్రభుత్వం అశోక్‌ను పట్టుకునే ప్రయత్నంలో ఉంది. ఐటీ గ్రిడ్స్‌ ఏయే వివరాలు సేకరించిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఫోన్‌ ట్రాకింగ్‌ ద్వారా వ్యక్తులు ఎక్కడున్నారు.. ఎక్కడకు వెళ్తున్నారు.. ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్‌ లిస్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఫోన్‌ స్టోరేజీలోకి వచ్చిన డేటాను డిలీట్‌ చేసే అవకాశం సేవా మిత్రకు ఉంది. ప్రతి సెల్‌ఫోన్‌కు ఐఎంఈఐ అనే నంబర్‌ ఉంటుంది. నంబర్‌ ద్వారా ఫోన్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నారు. ఇలాంటిది దేశానికే ముప్పు. దీంట్లో అత్యంత ప్రమాదకరమైంది మైక్రోఫోన్‌ ఆడియో రికార్డింగ్‌. ఎవరి ఫోన్‌ అయినా ఆన్‌చేసి వెరెవరితోనైనా మాట్లాడుతుంటే అది కూడా రికార్డు చేసే అవకాశం ఉంటుంది. చంద్రబాబు తన బినామీ అశోక్‌ దాకవరంతో దేశానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకొచ్చాడో అర్థం చేసుకోవచ్చు. 

డ్రైవింగ్‌ లైసెన్స్, ఎలాంటి కార్డు కావాలన్నా.. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఆధార్‌కార్డు నంబర్‌ ఇవ్వాల్సిందే. ఏపీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా వివిధ రకాల సేవల కోసం వచ్చిన పౌరుల వివరాలను సేవా మిత్ర యాప్‌ ద్వారా చోరీ చేశారు. ప్రతి కుటుంబంలో ఉన్న ఆడపిల్లల వయస్సు, ఆదాయం, ఉద్యోగం, ప్రతి కీలక సమాచారాన్ని సేవా మిత్ర యాప్‌ ద్వారా తీసుకెళ్లి ప్రైవేట్‌ కంపెనీ సర్వర్‌లో దొంగతనంగా ఎందుకు దాచారని ప్రశ్నిస్తున్నా.. సేవా మిత్ర డేటా బేస్‌ నుంచి సమాచారం ఎవరికి అందుబాటులో ఉంటుందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. టీడీపీ సభ్యులుగా నమోదైన ప్రతి ఒక్కరికి సేవా మిత్ర యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి టీడీపీ సభ్యుడికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి సమాచారం వారికి దగ్గర ఉంటుంది. సేవా మిత్ర డేటా బేస్‌ ఆధారంగా ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో తెలుసుకునేందుకు ఈ కుట్ర చేసింది. రకరకాల సర్వేలు చేసి ఎవరికి ఓటు వేస్తారు అని తెలుసుకొని అసంతృప్తి వ్యక్తం చేసిన వారందరి ఓట్లతో తొలగించారు. ఇంతటి ఘోరాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న స్తీ్రలకు అభద్రత భావం కల్పిస్తున్నారు. దొంగలించిన డేటాను పాకిస్తాన్, సిరియా, టె్రరరిస్టులకు చంద్రబాబు అమ్ముకోరనే నమ్మకం లేదు. 

రాష్ట్రంలో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్‌కు చేరింది. అశోక్‌ దాకవరం అనే వ్యక్తి చంద్రబాబు, లోకేష్‌ల బినామీ. అశోక్‌ అరెస్టు కాకుండా కాపాడుతుంది చంద్రబాబు, లోకేష్‌లని స్పష్టంగా అర్థం అవుతుంది. అశోక్‌.. ఎందుకు మీరు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు అశోక్‌కు భద్రత కల్పిస్తున్నారు. డేటా చోరీ తరువాత సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో సిట్‌ వేశారు. విచారణలో ఏం తేలిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బాలసుబ్రహ్మణ్యంపై ఉంది. దొంగతనాన్ని దాచేందుకు సిట్‌ వేశారా చెప్పాలి. 

చంద్రబాబు చాలా ప్రగల్భాలు చెబుతాడు. తానే ఆంధ్రరాష్ట్రానికి టెక్నాలజీ తీసుకొచ్చినట్లుగా ఫోజులు కొడతాడు. సీఎం డ్యాష్‌ బోర్డు అనేది చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక రాలేదు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చింది. చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన డ్యాష్‌ బోర్డు వర్షన్‌ 2 నాశనమైంది. పేరు, బ్యానర్‌ మార్చి సీఎం డ్యాష్‌బోర్డు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు చంద్రబాబు. సీఎం డ్యాష్‌ బోర్డుకు సంబంధించి టీసీఎస్‌ డేటా అని దివామీ డిజైన్‌ ల్యాప్‌ అనే దానికి ప్రాసెస్‌ చేసి అక్కడ నుంచి సీఎం డ్యాష్‌ బోర్డుకు ఇస్తారు. నవీన్‌ పుట్టగుంట, ప్రతిమ ఇనోళ్లు అనే చంద్రబాబు, లోకేష్‌లకు సంబంధించిన కంపెనీ. డేటాను స్టోర్‌ చేసుకునేందుకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రొవైడ్‌ చేస్తుంది. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రొవైడ్‌ చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో జీ2జీ, జీ2బీ, జీ2సీ కూడా చేయవచ్చు. మొత్తం ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ ప్రగతి అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించుకోకుండా దాన్ని పై డేటా సెంటర్‌ అనే సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. పై డేటా సెంటర్‌ కంపెనీ కల్యాణ్‌ ముప్పనేని, సుధీర్‌ కుప్పం అనే చంద్రబాబు, లోకేష్‌ బినామీలది. ఈ రకంగా అధికార దుర్వినియోగం జరుగుతుందని మీ దృష్టికి తీసుకువస్తున్నా. 

ఈ ప్రగతి, సీఎం డ్యాష్‌బోర్డు, ప్రతి విషయంలో కూడా అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం జరుగుతుందని గుర్తించాలి. జే. సత్యనారాయణ నిజాయితీ గల వ్యక్తి అని తెలుసు. అయినా చంద్రబాబుతో కుమ్మకై ఆధార్‌ డేటాను దొంగలించేందుకు చంద్రబాబుకు సహకరించాడని ఆరోపిస్తున్నాను. కానీ అవినీతి పరుడని చెప్పడం లేదు. ఎన్‌. బాలసుబ్రహ్మణం అనే వ్యక్తికి, ఆయన భార్యకు గ్రీన్‌ఆర్క్‌ సెల్యూషన్, ఓటీఎస్‌ఐ అనే రెండు సంస్థలు ఉన్నాయి. ఓటీఎస్‌ఐకి సీఈఓగా చంద్రశేఖర్‌ తాళ్లూరి అనే వ్యక్తి ఉన్నాడు. ఓటీఎస్‌ఐ ఆర్టీఐ యాప్‌ను డెవలప్‌ చేసింది. ఓటీఎస్‌ఐ అఫీషియల్‌ టెక్నాలజీ పాట్నర్స్‌ ఫర్‌ ఆర్‌టీఏ. టెండర్స్‌లో ట్రాన్స్‌ఫరెన్సీ లేదు ఏరకంగా కాంట్రాక్టు ఓటీఎస్‌ఐకి ఇచ్చారు. ఓటీఎస్‌ఐ అభయ అనే యాప్‌ను రూపొందించింది. మహిళలు ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక బటన్‌ నొక్కితే అలారం ఇచ్చి వారికి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. దాని కోసం విజయవాడ, విశాఖపట్నం రెండు కేంద్రాల్లో మాత్రమే లక్ష ఆటోల్లో రూ.188 కోట్లు పెట్టి ఒక పైలెట్‌ ప్రాజెక్టుగా ఓటీఎస్‌ఐ అనే కంపెనీకి చెల్లింపులు చేసింది. బాలసుబ్రహ్మణం గారూ.. మీరు నిజాయితీ కలిగిన ఆఫీసర్‌ అయితే ఓటీఎస్‌ఐ అభయ ద్వారా ఎంత మంది మహిళల దగ్గర నుంచి ఎన్ని ఎస్‌ఓఎస్‌లు వచ్చాయనేది చెప్పాలి. ఎన్ని అత్యాచారాలను అడ్డుకున్నారో చెప్పాలి. 

స్వయాన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గంలో ఎలా డేటా సేకరించారో తెలుసుకోవచ్చు. ఆధార్‌ హోల్డర్‌ నంబర్, పేరు సేకరించిన డేటాను తెలుగుదేశం పార్టీ యాప్‌కు ఫార్వర్డ్‌ చేశారు. అనుకూలంగా లేని వారిని గుర్తించి ఓట్లను తొలగించేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా.. ఆడపిల్లలు, స్తీ్రల డేటాను సేకరించి ఆడపిల్లల జీవితాలతో తెలుగుదేశం పార్టీ దోపిడీ దారులు ఆడుకుంటున్నారు. సేకరించిన డేటాను టె్రరరిస్టులకు అమ్మే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నానని విజయసాయిరెడ్డి అన్నారు. 

 

ReplyForward

Back to Top