గుంటూరు: ముద్రగడ పద్మనాభంకు సంబంధించిన విషాద సంఘటనను అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాను వేదిక పంచుకోవడాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్రగడ సభకు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారని గుర్తుచేశారు. కాపులు ఒక్కటవుతుంటే చంద్రబాబుకు కడుపుమంట ఎందుకని అంబటి ప్రశ్నించారు. కాపుల్లో అలజడి మొదలైందంటూ బోండా ఉమ చేసిన వ్యాఖ్యలపై ఆక్షేపణలు ఉండవచ్చని పేర్కొన్నారు. ముద్రగడ తర్వాత కాపు సామాజికవర్గానికి పెద్దన్నగా ఎవరు నిలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష కాపు సామాజికవర్గంలో ఉందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.