మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు జారీ

తాడేపల్లి: మెడికల్‌ కాలేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులను జారీ చేసింది. రూ.2,050 కోట్లకు పరిపాలనా అనుమతులిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు విశాఖ జిల్లా పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు కేటాయింపు, కడప జిల్లా పులివెందులలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ.500 కోట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు రూ. 550 కోట్లు కేటాయించారు. పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల కాలేజీల్లో 100 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు. అమలాపురం, ఏలూరు, పులివెందుల, పిడుగురాళ్ల, మదనపల్లి, ఆదోనిలో కాలేజీల స్థలాల కొనుగోలుకు రూ.104.17 కోట్లు పరిపాలనా అనుమతులు జారీ చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top