భారత మహిళల కబడ్డీ జట్టుకు వైయ‌స్‌ జగన్‌ అభినందనలు

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత జట్టుకు ప్రశంసలు

తాడేపల్లి: ఆసియా క్రీడలు–2026లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల కబడ్డీ జట్టుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇరాన్‌పై 37–34 తేడాతో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.  

ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా భారత మహిళల జట్టును అభినందిస్తూ..  సంజు దేవి అద్భుత ప్రదర్శనతో పాటు చివరి నిమిషాల్లో జట్టు ప్రదర్శించిన సమయస్ఫూర్తి, పట్టుదల ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారిణి అద్భుతమైన ప్రతిభ, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని కొనియాడారు. భారతదేశంలోని మరింత మంది యువతులు తమ క్రీడా కలలను సాకారం చేసుకునేలా ఈ విజయం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. 
 Image

Back to Top