అయ్యన్నకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు 

కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 
 

తాడేప‌ల్లి :  టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేద‌ని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మండిప‌డ్డారు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి  ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడ‌ని విమ‌ర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించాన‌ని గుర్తు చేశారు. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నామ‌ని చెప్పారు.  తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్‌లోనే  బెంజ్‌ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్‌ బెంజ్ కారును సీజ్ చేసింద‌ని చెప్పారు. 2020 జూన్‌లో ఈఎస్‌ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్‌ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను ఈ కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాల‌ని నిల‌దీశారు.  టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా.. ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేద‌ని గుమ్మ‌నూరు జ‌య‌రాం వెల్ల‌డించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top