పీలేరు: యువనేత పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో, పీలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షతన పీలేరు వైయస్ఆర్‌సీపీ మండల స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఇప్పటి నుంచే సమష్టిగా పనిచేయాలని పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తూ వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.