మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత

చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 తూర్పుగోదావరి : బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కాకినాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమలో తీవ్ర విషాదం అలుముకుంది.

ఎంవీఎస్ నాగిరెడ్డి సంతాపం
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్ట‌బ్బాయి మ‌ర‌ణ వార్త త‌న‌ను క‌లచివేసింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు, అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు చిట్ట‌బ్బాయి మృతికి సంతాపం తెలుపుతూ..ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. అలాగే తూర్పుగోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ప‌లువురు చ‌ట్ట‌బ్బాయి మృతి ప‌ట్ల సంతాపం తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top