ప్రొద్దుటూరు: ఆచరణ సాధ్యం కాని అమరావతికి మావిగన్ పేరుతో వైయస్ జగన్ గారు సూచించిన ప్రత్యామ్నాయ మార్గంపై రాష్ట్రంలో లోతుగా చర్చ జరుగుతోందని, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే శిఖండి లాంటి ఏబీఆర్ రాధాకృష్ణను రంగంలోకి దించి చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తూ చంద్రబాబుకి బ్రోకరిజం చేస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ ఇంకోసారి నోరు జారితే నాలుక కోసి ఉప్పూ కారం పెట్టి ఊరగాయ పెట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఒళ్లు కొవ్వెక్కి, కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్న రాధాకృష్ణ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవడం ఖాయమని ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: జగన్‌గారి ప్రతిపాదనతో వణుకు. అందుకే..: రాష్ట్ర రాజధాని విషయంలో ప్లాన్–బీగా జగన్ గారు సూచించిన ‘మావిగన్’కు ప్రజల్లో విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో వణుకు పుట్టింది. అందుకే సోషల్ మీడియాలో కోట్లు ఖర్చు చేసి ట్రోలింగ్ మొదలుపెట్టారు. జగన్‌గారిని అపహాస్యం చేస్తూ నీచాతి నీచమైన మాటలతో దాడి మొదలు పెట్టారు. ఆ వెంటనే మంత్రులను, కూటమి ఎమ్మెల్యేలను రంగంలోకి దించి పచ్చ మీడియా ద్వారా బురద జల్లే కార్యక్రమానికి తెర తీశారు. చంద్రబాబు డైవర్షన్. రాధాకృష్ణ బ్రోకరిజం: అయినా మావిగన్‌పై చంద్రబాబు కుట్ర రాజకీయాలు వర్కవుట్ కాకపోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా శిఖండి లాంటి ఏబీఎన్ రాధాకృష్ణను బరిలోకి దింపాడు. జర్నలిజం ముసుగులో ఏబీఎన్ రాధాకృష్ణ చేసేది పచ్చి బ్రోకరిజం. నిత్యం జాకీలతో చంద్రబాబును ఎత్తడమే ఆయన పని. అందుకే చెత్తపలుకు పేరుతో వైయస్ఆర్‌సీపీ నాయకులను అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా చిత్రీకరించాడు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కొవ్వెక్కి పిచ్చి రాతలు రాశాడు. వాటిపై మా ఇళ్లలో మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. మీకు వెంటనే తగిన బుద్ధి చెప్పాలని వారంటున్నారు. కానీ, మా నాయకుడి సభ్యత, సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆయన గౌరవాన్ని కాపాడడం కోసం మేము ఇప్పుడు ఆ పని చేయడం లేదు. ఏబీఎన్ రాధాకృష్ణ చేస్తున్న అక్షర వ్యభిచారానికి ఏదో ఒక రోజు కచ్చితంగా తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఏబీఎన్ రాధాకృష్ణకు మానసిక దౌర్భాగ్యం పట్టింది. ఇంకా క్షమించేది లేదు: పరాయి మహిళలను తోబుట్టువులుగా, తల్లిగా భావిస్తాం కాబట్టే ఏమీ అనలేకపోతున్నాం. కానీ కనీస సభ్యత, సంస్కారం ఏబీఎన్ రాధాకృష్ణకు లేవు. అందుకే ఇంతలా దిగజారిపోయారు. చంద్రబాబు కోసం అక్షర వ్యభిచారం చేసే కన్నా రాధాకృష్ణ కూలీ పనులు చేసుకుని బతకొచ్చు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే క్షమించేది లేదని, తమ పార్టీ మహిళలు రాధాకృష్ణ నాలుక కోసి ఉప్పుకారం పెట్టడం ఖాయమని రాచమల్లు శివప్రసాదరెడ్డి హెచ్చరించారు.