ఏబీఎన్ రాధాకృష్ణపై ఎస్పీకి ఫిర్యాదు 

రాజోలు నాయకురాలు పాముల రాజేశ్వరి దేవి ఆధ్వర్యంలో వినతి 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజోలు నియోజకవర్గానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత రాధాకృష్ణపై రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.  ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గానికి చెందిన పాముల రాజేశ్వరి దేవి ఇతర ప్రముఖులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మీడియా వేదికగా ప్రసారం అవుతున్న కొన్ని వ్యాఖ్యలు, వార్తలు సమాజంలో అపోహలు సృష్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, వర్గాల మధ్య విభేదాలు రేకెత్తించేలా ఉన్న వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ప్రజాస్వామ్యంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. ఇలాంటి ప్రసారాల వల్ల సామాజిక వాతావరణం దెబ్బతింటుందని పేర్కొంటూ, సంబంధిత విషయంపై పూర్తి స్థాయి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Back to Top