బహుదా బ్రిడ్జి నిర్మాణం రద్దుపై వైయ‌స్ఆర్‌సీపీ ఆగ్రహం 

ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం

సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆగ్ర‌హం

శ్రీకాకుళం జిల్లా : బహుదా బ్రిడ్జి నిర్మాణం రద్దు అంశంపై వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం పట్టణంలో బహుదా బ్రిడ్జి కూలిన ప్రదేశంలోనే సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ నాయకత్వం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 మే 3న ఓవర్‌లోడ్ ట్రక్ కారణంగా కూలిపోయిన బహుదా బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కేవలం మూడు నెలల్లోనే అనుమతులు మంజూరు చేసి, రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. అయితే 2024 జూన్‌లో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ నిర్మాణాన్ని రద్దు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. గత 95 సంవత్సరాలుగా ఇచ్చాపురం పట్టణ రవాణాకు కీలకంగా ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వైయ‌స్ఆర్‌సీపీ ధర్మమని స్పష్టం చేశారు.

ఇచ్చాపురం ఎమ్మెల్యే, కేంద్ర మంత్రి గతంలో బ్రిడ్జి వద్దకు వచ్చి వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్మించకపోతే తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్మిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికి రెండేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఎద్దేవా చేశారు. నరేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై ప్రశ్నించాల్సిన కూటమి పార్టీలు మౌనంగా ఉన్నాయని, ప్రజల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని అన్నారు. వెంటనే బహుదా బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం నుంచి పనులు చేయిస్తామని హెచ్చరించారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి మాట్లాడుతూ బ్రిడ్జి అత్యవసరతను వివరించారు. శ్రీకాకుళం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు. కంచిలి ఎంపీపీ పైల దేవదాసు రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇచ్చాపురం ఎంపీపీ బోర పుష్ప, పట్టణ వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు ప్రకాశ్ రావు పట్నాయక్ సహా పలువురు నాయకులు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో సల్ల దేవరాజు, ప్రత్తి అన్వేష్, సుగ్గు ప్రేమ్ కుమార్, నర్తు ప్రేమ్ కుమార్, పాతిర్ల రాజశేఖర్, కాళ్ళ సత్యం, పిలక దేవరాజు (సంతు), నీలాపు ఢిల్లీ, సాలిన ఢిల్లీ, సాలిన గాంధీ, పి.తేజేశ్వరావు, చాట్ల తిరుపతి, రామ్మూర్తి, నీలాపు జగదీశ్, కారింగి మోహనరావు, బాధకల మోహన్ దాసు, లోపింటి దీనభందు, మడ్డు అభి, కొనపల సురేష్, తలగాన తిరుపతి, ఇసురు తులసిరామ్, సప్ప వంశీ, రషీదా సుల్తానా, సాడి జయరాం, బచ్చు రఘు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top