చంద్రబాబు అవినీతికి ఐటీ శాఖ నోటీసులే సాక్ష్యం

 చంద్రబాబు స్కామ్‌ ఏంటన్నది మనవడికి కూడా అర్ధమవుతోంది

అసెంబ్లీలో స్కిల్‌ స్కామ్‌పై చర్చలో మాజీ మంత్రి పేర్ని నాని

డిజైన్‌టెక్‌ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేశాడు

సీమెన్స్‌ రూ. 3వేల కోట్లు ఇస్తామన్నట్లు ఒప్పందంలో లేదు

డొల్ల కంపెనీలకు స్కిల్‌ నిధులు మళ్లింపు

ఒప్పందంపై చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారుఐఏఎస్‌ల అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు
 
బాబు జైలుకెళ్లగానే ఆయన సీట్లో బాలయ్య కూర్చున్నారు

స్కిల్ స్కామ్‌పై సంపూర్ణంగా విచార‌ణ జ‌రిగి, నేర‌స్తుల‌ను క‌ఠినంగా శిక్షించాలి 

అమ‌రావ‌తి: చంద్రబాబు స్కిల్ స్కామ్‌ ఏంటన్నది రిమాండు రిపోర్టు చూస్తే ఆయ‌న మనవడికి కూడా అర్ధమవుతోంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.  చంద్రబాబు సీఎం అయిన తర్వాత స్కిల్ స్కామ్‌ను అమలు చేశాడ‌ని, డిజైన్‌టెక్‌ ప్రతినిధిని కలిసిన 19 రోజులుకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేశార‌ని త‌ప్పుప‌ట్టారు. చంద్రబాబు డబ్బును ఎత్తేయడంలో ఎంతో ఆత్రంగా వ్యవరించారు. స్కిల్‌ స్కామ్‌లో ఏం జరుగుతుందో చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికీ అసలు విషయం తెలియద‌ని చెప్పారు. గంటా సుబ్బారావును తీసుకొచ్చి అందలం ఎక్కించార‌ని విమ‌ర్శించారు. హవాలా ద్వారా చంద్రబాబు ఖాతాలోకి డ‌బ్బులు చేరాయి, ఇందులో వికాస్‌ ఖన్వేలర్, సుమన్‌ బోస్‌లిద్దరూ తోడు దొంగలే అన్నారు. శుక్ర‌వారం అసెంబ్లీలో స్కిల్‌ స్కామ్‌పై చర్చలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు.   

  • సహచర ఎమ్మెల్యే, రిమాండ్‌ ఖైదీ చంద్రబాబు..స్కిల్‌ స్కామ్‌ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక ఐఏఎస్‌ అధికారి కోర్టు ముందు వాగ్మూలం ఇచ్చారు. జడ్జి గారి ముందు సీఎం ఒత్తిడితో ఆ స్టేట్‌మెంట్‌ఇచ్చామని అంటున్నారు. వాళ్లందరికీ చంద్రబాబుపై ఉన్న ప్రేమతో వాస్తవాలు చూడటం లేదు. వాస్తవాలు చూడండి. చంద్రబాబు ఆ డబ్బు ఎత్తేయడంలో ఎంతగా ఆత్రంగా వ్యవహరించారో గమనిద్దాం.
  • 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే ఆగస్టు 22న సీమెన్స్‌ ప్రతినిధి, డిజైన్‌ టెక్‌ ప్రతినిధి చంద్రబాబును కలిశారు. వారు కలిసిన 19 రోజులకే ఏపీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖను ఏర్పాటు చేశారు. ఒక డొల్ల కంపెనీ చెప్పిన 19 రోజులకే స్కిల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి గంటా సుబ్బారావు అనే అధికారిని నియమించారు.
  • టీడీపీ జమ ఖర్చులు చూసే ఆడిటర్‌ను తీసుకొచ్చి స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ఆడిటర్‌గా ఏర్పాటు చేశారు. నవంబర్‌ 1న ఆయన్ను నియమించారు.
  • గంటా సుబ్బారావును మూడు చోట్ల నియమించారు. గంటా సుబ్బారావు, చంద్రబాబుకు తప్ప మరొకరికి స్కిల్‌లో ఏం జరుగుతుందో తెలియదు. 
  • జైల్‌ బయట చంద్రబాబు బంధువు చెబుతున్నారు. రిమాండు రిపోర్టులో ఏమీ లేదని 8 ఏళ్ల పిల్లాడు కూడా చెబుతాడని అంటున్నారు. ఈ వివరాలు తెలిస్తే 8 ఏళ్ల పిల్లాడికే మా తాత ఇంత స్కిలా అని అర్థమవుతుంది.
  • ఫిబ్రవరి 6వ తేదీన కేబినెట్‌ అప్రూవల్‌ ఇచ్చారు. సీమెన్స్‌ కంపెనీ రూ. 3 వేల కోట్లు ఇస్తుందని, ఒక్కో క్లస్టర్‌కు రూ.6400 కోట్లు ఖర్చు చేయాలని చంద్రబాబు కేబినెట్లో చెప్పారు. చంద్రబాబు గ్లామర్‌ చూసి ఈ ప్రాజెక్టు సీమెన్స్‌ కంపెనీ పరుగెత్తుకొని వచ్చిందని స్టోరీలు చెప్పాడు. 
  • జూన్‌ 30వ తేదీన జీవో ఇచ్చాడు. కరెంటు పోయిందని డబ్బులు ఎత్తుకెళ్లిన వ్యక్తితో సాక్ష్యం చెప్పించారు. రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెడతామన్న సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం ఆ జీవోలో లేదు. జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకున్నారు. జీవోలో ఉన్నవి  ఒప్పందంలో మాయమయ్యాయి. రెండు డొల్ల కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు.
  • ప్రభుత్వం పంపించే రూ.371 కోట్లు సీమెన్స్‌ కంపెనీకి పంపించాలి కదా?డొల్ల కంపెనీకి ఎందుకు పంపించారు. గంటా సుబ్బారావు ఫైల్‌ రాస్తాడు..ఆయనే ఫైల్‌ తీసుకొని ఎడ్యుకేషన్‌ శాఖకు వెళ్తాడు. అక్కడి నుంచి ఆయనే ఫైల్‌ సీఎంవోకు తీసుకెళ్లి సంతకం చేయిస్తాడు. ఆర్థిక శాఖ వద్దకు తీసుకెళ్లి అర్జెంట్‌గా రూ.371 కోట్లు డిజైన్‌ టెక్‌కు పంపించాలని చెబుతాడు. సీమెన్స్‌కు కదా డబ్బులు పంపించాలని ఏ ఒక్కరూ కూడా మాట్లాడరు. అందరూ కూడా తేలు కుట్టిన దొంగల్లా ఉన్నారు.
  • ఒప్పందం జరిగిన మాసంలో ముకుల్‌ అనే వ్యక్తిని స్కిల్‌ కార్పొరేషన్‌లో నియమించారు. పీవీఎస్‌పీకి డబ్బులు పంపించారు. యోగేష్‌ గుప్తా అనే మనీ డీలర్‌ను నియమించారు. డొల్ల కంపెనీలతో హవాలా ద్వారా తమకు కావాల్సిన వారికి డబ్బులు పంపించారు.చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చారు. 
  • ఇవాళ చంద్రబాబు పతివ్రత కబుర్లు చెబుతున్నాడు. ఇక్కడ కూర్చొని ఈలలు వేసిన టీడీపీ నేతలు ఒళ్లు మరచిపోయి..వారికి ఉన్న రుగ్మతను ప్రదర్శించారు. రూ.3300 కోట్లతో ఒప్పందమైన కంపెనీకి ఒక్క నయాపైసా కూడా ఇవ్వకుండా, ఒక్క క్లస్టర్‌ ఏర్పాటు చేయకుండా రూ.371 కోట్లు ఆదరాబాదరగా డబ్బులు ఎత్తేయడం అన్నది చంద్రబాబు దొంగతనమని తేటతెల్లం కావడం లేదా?
  • 2015,5 తేదీన రూ.120 కోట్లు, మొత్తంగా రూ.371 కోట్లు కొల్లగొట్టారు. ఇన్ని చేసిన చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు అరెస్టు కాగానే మా వాడు వచ్చి మాట్లాడుతున్నాడు.
  • సీఎం అన్న వ్యక్తి మౌఖిక ఆదేశాలు ఇస్తారే కానీ, ఎక్కడ సంతకాలు పెట్టరని స్పెషల్‌ ఫ్లైట్లో వచ్చిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశాడు. చద్రబాబు మాత్రం సీఐడీ అధికారుల ముందు..ఏమో, నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అంటున్నాడు.
  • ప్రమాణాలను తుంగలో తొక్కి ప్రజల డబ్బును తిన్న చంద్రబాబు ఇవాళ ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు. డబ్బులు ట్రాన్సఫర్‌ అయినట్లు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా అని కొందరు వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ మీకు పీఏ ద్వారా డబ్బులు చేరాయని చెబుతున్నా కూడా..బుకాయిస్తున్నారు.ఇన్‌కం ట్యాక్స్‌ నోటీసు ఇస్తే చంద్రబాబు సమాధానం ఇచ్చారు కదా? 
  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో స్కామ్‌ జరగలేదని ఏ ఒక్క లాయర్‌ కూడా చంద్రబాబు తరఫున మాట్లాడటం లేదు. సెక్షన్‌ 17ఏ గురించి మాట్లాడుతున్నారు. గవర్నర్‌ అనుమతి తీసుకోలేదంటున్నారు.
  • బావను అరెస్టు చేయగానే ఒకాయన వెళ్లి కుర్చీలో కూర్చున్నారు. ఇక్కడ కూడా సభలో చంద్రబాబు కుర్చీలో ఒకాయన ఎక్కారు. ఆయన మాట్లాడుతున్నారు. 2 లక్షల మందికి ట్రైనింగ్‌ ఇచ్చామని మాట్లాడుతున్నారు.
  • రూ.371 కోట్లు దోచేసిన తరువాత, మళ్లీ ప్రభుత్వం స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు ఖర్చు చేశారు. ఆ డబ్బుతో రెండు కోర్సుల్లో శిక్షణ ఇచ్చారు. మామూలుగా టెండర్లు పిలవాలి. ఆకలితో ఉన్న చంద్రబాబు, పక్కన కొడుకు చేరాడు. రెండు జేబులు నింపాలంటే దొంగ కంపెనీలు, దొంగ ఎంవోయూలు చేసుకుని రూ.371 కోట్లు దిగమింగారు.
  • పేద, మధ్య తరగతి పిల్లల ఉసురు పోసుకున్నారు. నైపుణ్యం నేర్పిస్తామని చెప్పి  వారి ఆశలను అడియాసలు చేశారు. అడ్డంగా పేదల సొమ్ము దోచేశారు. సీమెన్స్‌ కంపెనీ ఒప్పందాలతో మాకు సంబంధం  లేదంటుంది. ఇప్పటికే గుప్తాను అరెస్టు చేశారు. ఈడీ ఎందుకు కేసు కట్టింది. జీఎస్టీ ద్వారా కేసులో పాత్రదారులు ఇప్పటికే జైలుకు వెళ్లారు. సూత్రదారి జైల్‌కు వెళ్లకూడదా? లబ్ధి పొందిన చంద్రబాబును అరెస్టు చేయడం వందకు వందశాతం సబబే. లూటీ జరిగిందని తేటతెల్లమైంది. ఈడీ, ఐటీ, సీఐడీలు విచారణ చేపట్టి లూటీ జరిగిన డబ్బును రికవరీ చేయాలి.
  • తప్పు చేసిన ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కటే. డేరా బాబాను కూడా అరెస్టు చేశారు. డేరా బాబా చౌదరి కూడా నేరం చేసి దొరికిపోయాడు. వ్యక్తుల కంటే, డబ్బు కంటే చట్టం, ధర్మం అత్యంత బలమైంది. న్యాయం, ధర్మం బతికున్నాయి. 
  • ఈ విచారణను కొనసాగించాలి. ఎవరు ఎన్ని రకాలుగా, ప్రేరేపించిన ఉద్యమాలకు లొంగకుండా, అమాయకులకు నైపుణ్యం నేర్పిస్తామని వారి పేరుతో దోచుకున్న వారిని శిక్షించాలని, సంపూర్ణంగా విచారణ పూర్తి చేసి చట్టపరంగా నేరస్తులను శిక్షించాలని మాజీ మంత్రి పేర్ని నాని కోరారు.
  •  
Back to Top