బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం 

చెక్కులు అంద‌జేసిన వైయ‌స్ఆర్‌సీపీ కనిగిరి నియోజకవర్గం  ఇంచార్జి దద్దాల నారాయణ యాదవ్ 

మార్కాపురం జిల్లా: కనిగిరి నియోజకవర్గంలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఆర్థిక సహాయం అందించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి సూచనల మేరకు కనిగిరి నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జి ద‌ద్దాల నారాయ‌ణ యాద‌వ్ స్పందించారు.

ఇటీవల మార్కాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి మండలం చల్లగిరిగల పంచాయతీకి చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ మరియు ఆమె మనవరాలు తమ్మిశెట్టి రుక్మిణి మృతి చెందారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన దద్దాల నారాయణ యాదవ్, ఆదివారం పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు చెరో లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.2,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యంగా ఉండాలని సూచిస్తూ, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో మడతల కస్తూరి రెడ్డి, అబ్దుల్ గఫార్, సూరసాని మోహన్ రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, మండాది కృష్ణారెడ్డి, పోలక సిద్ధారెడ్డి, కాసుల బాలయ్య, బత్తుల మాలి, సంగటి మహేంద్ర రెడ్డి, కుమ్మరికుంట రవి, మల్లెల వెలుగొండయ్య, పచ్చవ వెంకటసుబ్బయ్య, మిట్ట రమేష్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుదే, గురుగులూరి శ్రీను, బసిరెడ్డి కోటిరెడ్డి, బసిరెడ్డి శ్రీను, బసిరెడ్డి వెంకటేశ్వర్లు, కోలా తిరుపాలు, గురువులూరి రమణారెడ్డి, ఉండపునేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top