రహస్య జీఓలపై విచారణ చేపట్టాలి

నెల్లూరు: చంద్రబాబు విడుదల చేసిన రహస్య జీఓలపై విచారణ చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆనం రాంనారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విధానాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు. ఎన్నికల కోడ్‌ ఉండగా ఉన్నతాధికారులను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు పెరగలేదు కానీ, అప్పులు మాత్రమే పెరిగాయన్నారు. రహస్య జీఓలతో చంద్రబాబు నిధులను కొల్లగొడుతున్నారని, జీఓలను బయటపెట్టాలని గవర్నర్, సీఎస్‌లను డిమాండ్‌ చేశారు. రహస్య జీఓలపై విచారణ చేసి కుట్రదారులను బయటపెట్టాలని కోరారు. సమీక్షల పేరుతో ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు చంద్రబాబు యత్నం చేస్తున్నారని, గతేడాది నుంచి ఇచ్చిన జీఓలపై విచారణ చేయాలని, దీనిపై తక్షణమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Back to Top