సంక్షేమం, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది వైయ‌స్ఆర్‌సీపీనే!

 జగ్గయ్యపేట 23వ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభం

ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట పట్టణంలోని 23వ వార్డులో వైయ‌స్ఆర్‌సీపీ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ తన్నీరు నాగేశ్వరరావు సతీమణి తన్నీరు సుధారాణి, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ హఫిజున్నీసా, 23వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కావేటి లక్ష్మి ప్రచారంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను, ప్రజల అభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను వివరించి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా తన్నీరు సుధారాణి, షేక్‌ హఫిజున్నీసా మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అవినీతికి తావులేని పాలనతో అభివృద్ధికి పట్టం కట్టాలని, ప్రజల ఆదరాభిమానాలతో వైయ‌స్ఆర్‌సీపీ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ హఫిజున్నీసా, 23వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కావేటి లక్ష్మిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top