పిల్లలను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం ఆశయం

నాడు–నేడుతో ఈ ఏడాది రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం

విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: మన రాష్ట్రంలోని పిల్లలను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చదువుల పట్ల సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ లక్ష్యమన్నారు. అందుకోసమే నాడు–నేడు అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, నాడు–నేడుతో ఈ ఏడాది రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి బొత్స చెప్పారు. 

నూతన విద్యా విధానం ద్వారా ఫౌండేషన్‌ స్కూళ్లకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మూడో తరగతి నుంచి ఐదుగురు సబ్జెక్ట్‌ టీచర్లను నియమిస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేస్తున్నామన్నారు. ఫౌండేషన్‌ స్థాయి నుంచే ఉన్నత విద్యను అందించాలన్నదే వైయస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.  
 

Back to Top