అమరావతి: రాష్ట్రంలో పండగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఏపీలో రూ. 3 వేలకు పెరిగిన వైయస్ఆర్ పెన్షన్ కానుకను సోమవారం(జనవరి1వ తేదీ) తెల్లవారుజాము నుంచే పంపిణీ చేస్తున్నారు వలంటీర్లు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్‌ను రూ. 3వేలకు సీఎం వైయస్ జగన్ పెంచడంతో పెన్షన్ల దారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఈనెల 3వ తేదీన కాకినాడలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.