స‌బ్సిడీపై విత్త‌నాల పంపిణీ

పార్వ‌తీపురం: ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహ‌న్‌ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంల ద్వారా   ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ  కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్ర‌వారం   పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలోని జగన్నాధపురం కాలనీలో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సబ్సిడీపై విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే  అలజంజి జోగారావు ప్రారంభించారు.   ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్ కి నాణ్యమైన విత్తనాలు, ఎరువులును పంపిణీ చేసేందుకు రైతు భరోసా కేంద్రాలలో ముందస్తుగా నిల్వచేసి నేరుగా రైతుల ఇంటి వద్దకే విత్తనాలను, ఎరువులను సరఫరా చేస్తున్నామ‌ని తెలిపారు.   రైతులు  తమ పేరును గ్రామ వ్యవసాయ సహాయకులు వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం పడి గాపులు కసేవారు అని, దళారులను ఆశ్రయించి నకిలీ విత్తనాలతో చాలా సందర్భాల్లో మోసపోయే వార‌ని గుర్తు చేశారు. అటువంటి పరిస్థితులు నుంచి మన ప్రభుత్వం వచ్చాక రైతుల‌కు  ఎలాంటి ఇబ్బందే లేకుండా రైతు భరోసా కేంద్రాల వ‌ద్ద ఎరువులు, విత్త‌నాలు స‌బ్సిడీపై అందిస్తున్నామ‌ని చెప్పారు. రైతులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పార్వతీపురం ఎంపీపీ మజ్జి శోభారాణి, వ్యవసాయ అధికారులు ఎస్ అవినాష్, రేఖ,  సూర్యప్రకాష్, పార్టీ పట్టణ అధ్యక్షులు కొండపల్లి బాలకృష్ణ, స్థానిక వార్డు కౌన్సిలర్ సభ్యులు అర్ చిన్నం నాయుడు, వ్యవసాయ సహాయకులు, స్టేట్ డైరెక్టర్లు, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top