కుప్పంలో క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు

రెండు పాఠశాలల గుర్తింపు ర‌ద్దు

చిత్తూరు:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, సానుభూతిప‌రులు, కార్య‌క‌ర్త‌ల‌పై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.  కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ కు చెందిన హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రామకుప్పంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల గుర్తింపును రద్దు చేస్తూ డీఈవో వరలక్ష్మీ ఉత్త‌ర్హులు జారీ చేశారు.  2025 - 26వ‌ విద్యాసంవత్సరం నుంచి ఈ రెండు పాఠశాలలను మూసివేస్తున్నామ‌ని, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని డీఈవో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవికి హఫీజ్ పోటీ చేశారు. ఈయ‌న‌కు సంబంధించిన ఈ రెండు స్కూళ్లు 2030- 2031 వరకు ఉన్న రెన్యూవల్ ను డీఈవో చేత ర‌ద్దు చేయించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. 

Back to Top