విజయవాడ రిటైనింగ్‌ వాల్‌కు సీఎం వైయ‌స్ జగన్‌ శంకుస్థాపన

విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. దీంతో  కృష్ణా నది వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న కృష్ణలంక వాసులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 125 కోట్ల రూపాయల వ్యయంతో రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు.

రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం ఇలా..
► విజయవాడ కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 1.5 కి.మీ పొడవునా ఫ్లడ్‌ ప్రొటెక్షన్‌ రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తారు.
► నదికి భారీ వరదలు వచ్చినప్పుడు 12 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్‌ వాల్‌కు రూపకల్పన చేశారు. 
► ఇందులో భాగంగా మూడు అడుగుల వ్యాసంలో 18 మీటర్ల లోతుకు పైల్, రాఫ్ట్‌ పునాదులపై 8.9 మీటర్ల ఎత్తులో 1.5 కి.మీ పొడవునా కాంక్రీట్‌ గోడ నిర్మిస్తున్నారు. 

వైయ‌స్సార్‌ సంకల్పమే..
కాగా, 2009లో కృష్ణా నదికి వరదలు సంభవించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విజయవాడ వచ్చి ఫ్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ మంజూరు చేశారు. అప్పట్లో యనమలకుదురు నుంచి కోటినగర్‌ వరకు ఈ వాల్‌ నిర్మించారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం కరకట్ట (వారధి) నుంచి కోటినగర్‌ వరకు ఫ్ల్లడ్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించనున్నారు.    

తాజా వీడియోలు

Back to Top