125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్ష

తాడేపల్లి: విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలక, నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ స్వరాజ్‌మైదాన్‌లో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు, పార్క్‌ అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం సమీక్షిస్తున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top