నేడు విశాఖ, గుంటూరు జిల్లాల్లో సీఎం వైయ‌స్‌ జగన్ పర్యటన

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నేడు విశాఖ‌ప‌ట్నం, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. బుధ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని త‌న‌ నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి చేరుకుని ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన‌ అనంతరం విశాఖ నుంచి బ‌య‌ల్దేర‌తారు. సాయంత్రం 6.30 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజ‌రుకానున్నారు. 

Back to Top