విజయవాడలో కూటమి నేతల దౌర్జన్యం

 మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పర్యటనను అడ్డుకున్న అధికార పార్టీ శ్రేణులు

 విజయవాడ: విజయవాడ న‌గ‌రంలో కూట‌మి పార్టీల నేత‌ల దౌర్జ‌న్యాలు కొన‌సాగుతున్నాయి. ఇవాళ‌ చిట్టినగర్‌లో మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ పర్యటనను అధికార పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు.  వెలంప‌ల్లి పర్యటనను అడ్డుకుంటామని కూటమి శ్రేణులు ప్రకటించడంతో భారీగా కూటమి నాయకులు చిట్టినగర్‌కు చేరుకున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు ఒకే ప్రాంతంలో ఉండటంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

Back to Top