స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌మ‌న్వ‌యంతో ప‌ని చేద్దాం

మాజీ ఎమ్మెల్యే  అన్నా రాంబాబు  

మార్కాపురం:  పొదిలి మండలం పాములపాడు గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్‌ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు పాల్గొని నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై అన్నా రాంబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాములపాడులో నిర్వహించిన ఈ విస్తృత సమావేశం పార్టీ శ్రేణుల ఐక్యతకు వేదికగా నిలిచింది.

Back to Top