వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైయ‌స్ జగన్‌

 తాడేపల్లి:  వినాయక చవితి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

 ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా తెలియజేశారు. 

Back to Top