ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి

ప్రజలందరికీ సీఎం వైయ‌స్‌ జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

తాడేపల్లి : దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దీపావళి అంటేనే కాంతి-వెలుగు. చీకటిపై వెలుగు..చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం..దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ.

దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నా’ అని సీఎం వైయ‌స్ జగన్‌ ఆకాంక్షించారు.

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ ఇలా..
 చీక‌టిపై వెలుగు.. చెడుపై మంచి.. అజ్ఞానంపై జ్ఞానం.. దుష్ట‌శ‌క్తుల‌పై దైవ‌శ‌క్తి సాధించిన విజ‌యాల‌కు ప్ర‌తీక‌గా జ‌రుపుకొనే పండుగ దీపావ‌ళి. ఈ దీపావ‌ళి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ స‌కల శుభాలు, సంప‌ద‌లు, సౌభాగ్యాలు, విజ‌యాలు క‌ల‌గాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటూ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

Back to Top