న్యూఢిల్లీ: నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం వైయస్ జగన్.. నేడు ప్రధానితో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధానితో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై ప్రధానితో సీఎం వైయస్ జగన్ చర్చించనున్నారు. అదే విధంగా మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ కానున్నారు. రాత్రి 10 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.