హైదరాబాద్: శంషాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సీఎం వైయస్ జగన్.. ప్రవచన మండపానికి చేరుకున్నారు. చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం నిర్వహించారు. ప్రవాస భారతీయ చిన్నారుల అవధానం సీఎం వైయస్ జగన్ వీక్షించారు. సీఎం వైయస్ జగన్ జన్మ నక్షత్రానికి సంబంధించిన విష్ణు సహస్ర శ్లోకాలు చిన్నారులు చదివి వినిపించారు. సీఎం వైయస్ జగన్ జన్మ నక్షత్రం స్వయంగా భగవత్ రామానుజల నక్షత్రమని వెల్లడించారు.