కడప అమీన్‌పీర్‌ దర్గాలో సీఎం ప్రత్యేక ప్రార్థనలు

వైయస్‌ఆర్‌ జిల్లా: కడప అమీన్‌ పీర్‌ దర్గాలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు.. దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ స్వాగతం పలికారు. దర్గాలో ఛాదర్‌ సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వ‌హించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. 

Back to Top