యువజన సర్వీసులు, పర్యాటక శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: యువజన సర్వీసులు, పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. 15 పర్యాటక ప్రదేశాల్లో వరల్డ్‌క్లాసు హోటల్స్‌ వచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు. వరల్డ్‌ క్లాసు స్టాండర్డ్స్‌ విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టేడియంల ప్రతిపాదనకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, జిల్లాకు ఒక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, మండల, నియోజకవర్గ స్థాయి స్టేడియాల అభివృద్ధికి కృషిచేయాలని సూచించారన్నారు. అదే విధంగా క్రీడాకారులకు ప్రోత్సహకాలు, కొండపల్లిపోర్టు, గాంధీ మ్యూజియం పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. త్వరలోనే ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నామని మంత్రి చెప్పారు. భాషా, సంస్కృతి అభివృద్ధికి కృషిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. సంస్కృతి వికాస కేంద్రాల ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు చేయాలని, అదే విధంగా కోటి రూపాయలతో శిల్పారామాలకు  మరమ్మతులు చేపట్టాలని సీఎం ఆదేశించారన్నారు.  
 

Back to Top