ఇండస్ట్రియల్‌ కారిడార్స్, పోర్టులపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఇండస్ట్రియల్‌ కారిడార్స్, పోర్టులపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆర్‌ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం.. రామాయపట్నం పోర్ట్‌ల నిర్మాణం పూర్తి కావాలని సూచించారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ సిటీకి బీచ్ రోడ్ నిర్మాణం పూర్తి కావాలన్నారు. పోలవరం నుంచి విశాఖకు పైప్‌లైన్‌ ద్వారా తాగునీటి సరఫరాపై డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top