పులివెందుల: వైయస్ఆర్ జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైయస్ జగన్ సోమవారం ఉదయం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అంతకుముందు చర్చి నుండి రోడ్డు మార్గాన బయలుదేరిన సీఎం వైయస్ జగన్ .. పట్టణంలోని గాయత్రీ కాలనీలో ఇటీవలే కుమారుని వివాహం చేసిన వైయస్ఆర్‌సీపీ నాయకుడు నల్లచెరువుపల్లి రవి ఇంటికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ తరువాత భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని.. అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి, ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం భాకరపురం హెలిప్యాడ్ నుండి మధ్యాహ్నం 12: 19 గంటలకు హెలికాప్టర్ లో బయలు దేరి.. జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కొడుకు, ఇద్దరు కూతుళ్ళ వివాహ వేడుకలలో పాల్గొన్నారు. సీఎం వైయస్ జగన్ కు మునిసిపల్ మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ వైయస్ మనోహర్ రెడ్డి, పాడా ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.