మానవత్వంతో స్పందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇద్దరికి తక్షణ ఆర్థిక సాయం  

తిరుపతి: ఆర్థిక సాయం కోసం ఆపన్న హస్తం కోరిన వారికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మానవత్వంతో స్పందించారు. వెంటనే ఆర్థిక సాయం అందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటరమణారెడ్డిని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశించారు. స్థానికుల నుంచి వినతులను స్వీకరించి వాటినీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. తుపాను వల్ల పంటలు నష్టపోయిన బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో శుక్రవారం తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాళెంకు సీఎం వచ్చారు.

ఆయనను కుటుంబ యాజమానులను కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పి.రమణమ్మ, ఐ.కవిత కలిసి తమకు సాయం చేయాలని కోరారు. దీంతో సత్వరమే స్పందించిన సీఎం..తిరుపతి జిల్లా కలెక్టర్‌ కే వెంకట రమణారెడ్డిని ఇరువురికీ ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించారు. సీఎం సూచనల మేరకు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డీకే బాలాజీ ఇద్దరు మహిళలరూ రూ.లక్ష వంతున చెక్కులను అందజేశారు.

Back to Top