కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన సీఎం వైయ‌స్ జగన్‌ భేటీ

 న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. సుమారు గంట 36 నిమిషాల పాటు వీరి స‌మావేశం కొన‌సాగింది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అమిత్‌ షాతో ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఆయనతో చర్చించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ అంతకుముందు కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్‌, షెకావత్‌లతో పాటు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. సీఎం వైయ‌స్‌ జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి ఉన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top