మ‌న ప్ర‌భుత్వంలో పేద‌ల ఆదాయం పెరిగింది

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమూల్ ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంది

2003లో చంద్ర‌బాబు చిత్తూరు డయిరీని మూసేశారు

హెరిటేజ్ కోసం కో-ఆప‌రేటివ్ డ‌యిరీల‌ను నిర్వీర్యం చేశారు

ప్రైవేట్ డ‌యిరీల అనైతిక‌త వ‌ల్ల స‌హ‌కార రంగాలు న‌ష్టాలు చ‌వి చూశాయి

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడే హెరిటేజ్ షేర్ ధ‌ర పెరుగుతుంది

మ‌న ప్ర‌భుత్వంలో పేద‌ల ఆదాయం పెరిగింది

చంద్రబాబు..హెరిటేజ్‌పై కోపంతో అమూల్ తీసుకురావ‌డం లేదు

చంద్ర‌బాబు గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు

రైతులకు ఉత్త‌మ పాల ధ‌ర అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ఉద్దేశ్యం

అమూల్‌తో  అక్కా చెల్లెమ్మ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

 అమ‌రావ‌తి: అమూల్ సంస్థ‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌హిళ‌ల‌కు, రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. చంద్ర‌బాబు త‌న సొంత డ‌యిరీ హెరిటేజ్ కోసం స‌హ‌కార రంగంలోని డ‌యిరీల‌ను నిర్వీర్యం చేయించార‌న్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం పాల ఉత్ప‌త్తిదారుల‌కు మేలు చేస్తున్నామ‌ని, అందుకే వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా అక్కా చెల్లెమ్మ‌ల‌కు ప‌శువుల‌ను పంపిణీ చేసి వారిని మ‌హిళా సాధికార‌త వైపు న‌డిపిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు. అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు గ‌ల కార‌ణాల‌ను, రాష్ట్రంలో స‌హకార రంగం ఎలా నిర్వీర్యం చేయ‌బ‌డింది అన్న అంశాల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌భ‌లో స‌వివ‌రంగా స‌భ్యుల‌కు వివ‌రించారు. ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..

 అమూల్ సంస్థ స‌హ‌కార రంగానికి చెందిన‌ది. దానికి పాలుపోసే వారే అమూల్ కు ఓన‌ర్లు..ఈ సంస్థ దేశంతో పోటీ ప‌డ‌టం లేదు. ప్ర‌పంచంతో పోటీ ప‌డుతోంది. ప్ర‌పంచంలోనే 8వ స్థానంలో ఉంది. అది ఒక పెద్ద స‌హ‌కారం సంస్థ‌.  మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీతో కూడా అమూల్ పోటీ ప‌డుతోంది. అమూల్ సంస్థ‌లో వ‌చ్చే లాభాల్లో వాట‌దారులు ఎవ‌రూ లేరు. లాభాల‌న్నీ కూడా పాలుపోసేవారే. వారే ఆదాయాన్ని పంచుకుంటారు. అమూల్ అత్య‌ధిక రేటు అక్కా చెల్లెమ్మ‌ల‌కు ఇవ్వ‌డ‌మే కాకుండా..ఇందులో ఆదాయం కూడా ఏడాదికి రెండుసార్లు తిరిగి అక్కా చెల్లెమ్మ‌ల‌కే  బోన‌స్ రూపంలో చెల్లిస్తారు.  ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉంది. ప్ర‌‌భుత్వ పెద్ద‌గా ..కుటుంబ పెద్ద‌గా మ‌నం ఎలా నిర్ణ‌యాలు తీసుకోవాలని ఆలోచ‌న చేస్తే..

నేను పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో ఓ మ‌హిళ నా వద్ద‌కు వ‌చ్చి మిన‌రల్ వాట‌ర్ బాటిల్ చూపించి..లీట‌ర్ నీరు రూ.21 ఉంది. పాల ధ‌ర లీట‌ర్ కూడా అంతే ఉందని చెప్పారు. లీట‌ర్ నీళ్ల మాదిరిగానే పాలు అమ్ముకునే దుస్థితి రాష్ట్రంలో ఉంద‌ని మ‌హిళ‌లు చెప్పారు. వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మొన్న నాతో చాలా మంది అక్కా చెల్లెమ్మ‌లు కూడా మాట్లాడారు. అన్నా..రేటు గిట్ట‌క ప‌శువుల‌ను అమ్ముకుంటున్నాం. మీరు అమూల్ తీసుకురావ‌డం వ‌ల్ల మ‌ళ్లీ మాకు భ‌విష్య‌త్ ఇచ్చారు అని  అన్నారు. పాలు పోసే అక్కాచెల్లెమ్మ‌ల‌కు ఎందుకు మంచి రేటు రావ‌డం లేద‌ని ఆలోచ‌న చేస్తే..

గ‌తంలో స‌హ‌కార రంగం ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పూర్తిగా ఖూనీ చేశారు. కో ఆప‌రేటివ్ సెక్టార్ లేక‌పోతే అప్పుడు ప్రైవేట్ డ‌యిరీలు ఇష్టం వ‌చ్చిన రేట్లు ఇచ్చి దోపిడీ చేస్తున్నారు. గ‌త్యంత‌రం లేక వారికే ..వారు ఇచ్చిన రేటుకు పాలు పోయాల్సి వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్థితిలో కేవ‌లం ఒకే ఒక వ్య‌క్తి..ఆ వ్య‌క్తి ప్రైవేట్ డ‌యిరీ స్థాపించ‌డం..దాన్ని లాభాల్లోకి తెచ్చుకునేందుకు అన్ని స‌హ‌కార రంగాల‌ను చంపేశారు. 

1974లో స‌హ‌కార రంగాన్ని ప్ర‌భుత్వ‌మే న‌డిపించేది. 1981లో డ‌యిరీ రంగంలో మ‌రో ప‌ద్ధ‌తిలి తీసుకువ‌చ్చారు. అక్క‌డి నుంచి బాగానే న‌డిచాయి. మ్యాక్స్ యాక్ట్‌ను 1995లో తీసుకువ‌చ్చారు. 1992లో చంద్ర‌బాబు హెరిటేజ్ స్థాపించారు. ఆ త‌రువాత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కావ‌డం అంద‌రికీ తెలుసు. 6 జిల్లా మిల్క్ యూనియ‌న్స్‌ను చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో స‌హ‌కార రంగంలోని వీటిని ఏపీ మ్యాక్స్‌లోకి తీసుకువ‌చ్చారు. ఏపీ మ్యాక్స్ ఏం చెబుతుందంటే..ఏదైన సొసైటీ, యూనియ‌న్ కానీ ఏపీ మ్యాక్స్‌కు క‌న్వ‌ర్ట్ కావాలంటే స‌హ‌కార రంగంలోని అన్ని కూడా ప్ర‌భుత్వానికి సంబంధించిన అన్నీ కూడ వెన‌క్కి ఇవ్వాల‌ని, రిఫండ్ చేయాల‌ని ఒక ఎంవోయూ చేసుకున్నాయి. దీంతో 6జిల్లా యూనియ‌న్స్ నామ్స్ అన్ని కూడా క‌న్వ‌ర్ట్ చేసి ఏపీ మ్యాక్స్‌లోకి వెళ్లాయి. 

ఇది ఒక ర‌క‌మైన అన్యాయ‌మైతే..జిల్లా యూనియ‌న్స్ ప్రోడ్యుస‌ర్ కంపెనీలుగా క‌న్వ‌ర్టు చేశారు. ఏపీ మ్యాక్స్‌లో ఎలాంటి ప్రోవిజ‌న్ లేదు. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం స‌హ‌కార రంగాన్ని ప్రైవేట్ ఓన‌ర్ షిఫ్ తీసుకునే స్థాయికి వెళ్లింది. ఈ రోజు మూడు యూనియ‌న్స్ ఏపీ మ్యాక్స్ కింద ఉన్నాయి. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం నిర్వీర్యం చేశారు. ఈ రోజు సంగం డ‌యిరీ ప‌రిస్థితి ఏంటంటే..దూళిపాళ్ల న‌రేంద్ర ఒక ప్రైవేట్ కంపెనీ కింద న‌డుపుతున్నారు. 

విశాఖ డ‌యిరీ కూడా ప్రైవేట్ రంగంలో న‌డుపుతున్నారు. చంద్ర‌బాబు హ‌యాంలోనే ద‌గ్గ‌రుండి స‌హ‌కార రంగాన్ని ఖూనీ చేశారు. చివ‌రికి చిత్తూరు డ‌యిరీ..హెరిటేజ్ డ‌యిరీకి పోటీ.  చిత్తూరు డ‌యిరీని బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు 2003లో ఏకంగా మూసివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. చంద్ర‌బాబు మ‌నిషి దొర‌బాబు..ఈయ‌న చిత్తూరు డ‌యిరీ చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. ఈయ‌నే డ‌యిరీని మూసి వేశారు కాబ‌ట్టి ఏకంగా ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో హెరిటేజ్ కంపెనీ కూడా లాభాల్లో ఉంటుంది. షేర్స్ కూడా చంద్ర‌బాబు మేనేజ్ చేస్తున్నారా అన్న అనుమానం క‌లుగుతుంది. 1999 జ‌న‌వ‌రి నుంచి ఈరోజు వ‌ర‌కు ఏం జ‌రిగిందో చూడండి. 

జ‌న‌వ‌రి 1999లో షేర్ విలువ రూ.2.89 పైస‌లు మాత్ర‌మే. 2003 డిసెంబ‌ర్‌లో షేర్ విలువ రూ.26.90 పెరిగింది. ప్ర‌భుత్వం ర‌ద్దు చేసి మ‌ధ్యాంత‌ర ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌మ‌యానికి షేర్ విలువ 10 రెట్లు పెరిగింది. 2009 ఏప్రిల్ నాటికి..ఎన్నిక‌ల‌కు ముందు మ‌ళ్లీ షేర్ విలువ రూ.16.35కు ప‌డిపోయింది. అప్పుడు అధికారంలో లేడు.  మ‌ళ్లీ సైకిల్- కాంగ్రెస్ ప్ర‌భుత్వం అంటే కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వంలో హెరిటేజ్ షేర్ విలువ రూ.35నుంచి రూ.100కు పెరిగింది. ఆ తరువాత చంద్ర‌బాబు సీఎం అయ్యారు. అప్పుడు రూ.100 ఉన్న షేర్ ధ‌ర 2017 నాటికి రికార్డు స్థాయిలో రూ.827కు పెరిగింది. సీఎంగా ఉంటూ షేర్ ధ‌ర‌లు ఈమాత్రం ఎగ‌బ‌కాడం షేర్ రిగ్గింగ్ అంటారా? మ‌రెమంటారో తెలియ‌దు. బాబు సీఎం ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌రువాత 2020 మార్చి నాటికి మ‌ళ్లీ రూ.220 నాటికి త‌గ్గింది. ఒక్క‌సారి గ‌మ‌నించాలి. 

మ‌న ప్ర‌భుత్వంలో పేద‌ల ఆదాయం పెరిగింది. బ్యాంకు లావాదేవీలు పెరిగాయి. చంద్ర‌బాబు అధికారాన్ని ఏర‌కంగా ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆరాటం త‌క్కువ‌గా ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా హెరిటేజ్ ఫుడ్  సైన్ ఎంవోయూ ..ఈజీ లోన్ టూ ఫార్మ‌ర్ చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో సంత‌కం చేశారు. బ్యాంకుల‌తో లోన్లు ఇప్పంచినందుకు వారు హెరిటేజ్‌కు పాలు పోయాల‌ని ఏకంగా ఎంవోయూలు చేసుకున్నారు. ఏ ర‌కంగా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుందో ఇంత క‌న్న నిద‌ర్శనం ఏముంది?. ఈ రోజు రాష్ట్రంలో ఇంత దారుణంగా ప‌రిస్థితి ఉంటే..

రాష్ట్రంలో పాలు ఉత్ప‌త్తి చేసే రైతులు స‌రైన ధ‌ర రాని ప‌రిస్థితిలో, స‌హ‌కార రంగం ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లో ఉన్న స‌మ‌యంలో అక్కా చెల్లెమ్మ‌లు న‌ష్ట‌పోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 27 ల‌క్ష‌ల మంది పాల ఉత్ప‌త్తిదారులకు మేలు జ‌ర‌గాలంటే పాల రంగంలో పోటీ ఉండాలి. ఏపీ డ‌యిరీ డెవ‌ల‌ప్‌మెంట్ సొసైటీ ఎలా ఉందో గ‌మ‌నించాలి. అమూలు వ‌స్తే ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌ని మ‌నం క‌ష్ట‌ప‌డ్డాం.  అమూలు రాక‌పోతే మెజారిటీ కూలింగ్ యూనిట్లు ష‌ట్‌డౌన్‌లోకి వెళ్లాయి. కేవ‌లం 800 గ్రామాలు మాత్ర‌మే ప్రోక్యూర్‌మెంట్‌లో ఉన్నాయి. చాలా డ‌యిరీలు మూత ప‌డ్డాయి. మిష‌న‌రీలు చెడిపోతున్నాయి.  ప్రైవేట్ డ‌యిరీల అనైతిక ప‌రిస్థితి వ‌ల్ల స‌హ‌కార రంగం న‌ష్టాల్లోకి వెళ్లి..అది ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్లింది. ప్రైవేట్ వ్య‌క్తుల దోపిడీ కార‌ణంగా ఏపీ ప్ర‌భుత్వం 21.07.2020న అమూల్ సంస్థ‌తో ఒప్పందం కుదిర్చుకుంది. 

మ‌హిళా సాధికార‌త‌పై ప్ర‌త్యేక దృష్టితో పాల ఉత్ప‌త్తి ద్వారా అక్కాచెల్లెమ్మ‌ల‌ను చెయ్యి ప‌ట్టుకుని న‌డిపించాల‌ని ప్ర‌భుత్వం త‌ప‌న‌. రైతుల‌కు మంచి పాల ధ‌ర అందించాల‌న్న‌ది ముఖ్య ఉద్దేశం. వినియోగ‌దారుల‌కు నాణ్య‌మైన పాలు అందించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్యం. అమూల్ మార్కెటింగ్ అనుసంధానం కోసం ఎంచుకోవ‌డం జ‌రిగింది. ఒక వ్య‌వ‌స్థ‌ను మ‌నం క్రియేట్ చేయాలి. ప్ర‌తి గ్రామంలో బ‌ల్స్ మిల్క్ కూలింగ్ యూనిట్లు పెట్టించాలి. అక్కా చెల్లెమ్మ‌ల‌కు అవులు, గేదెలు పంపిణీ చేస్తున్నాం. వీరు ఈ కేంద్రాల్లో పాలు పోస్తారు. అమూల్ సంస్థ ఇక్క‌డి నుంచి కొనుగోలు చేసి..ఎక్కువ లాభం సంపాదించి..లాభంలో కూడా మ‌హిళ‌ల‌క బోన‌స్ ఇవ్వ‌డం . ఇది గొప్ప కార్య‌క్ర‌మం. దేశ స‌హ‌కార రంగంలో ప‌ని చేస్తున్న వాటిని అతి ఉత్త‌మ‌మైనది అమూల్‌. పాల ఉత్ప‌త్తుల కోసం విస్తృత మార్కెటింగ్ స‌దుపాయం క‌లిగిన సంస్థ అమూల్‌. 

అమూల్ ఏడాదంతా రైతుల‌కు మంచి ధ‌ర అందించ‌డ‌మే కాకుండా లాభాల్లో బోన‌స్ ఇస్తుంది. ప్ర‌భుత్వం 9899 పాల పోటెన్షియ‌ల్ ఉన్న గ్రామాలుగా ఎంపిక చేశాం. ఆర్‌బీకేల ప‌రిధిలో మ‌హిళా డ‌యిరీ స‌హ‌కార సంఘాల‌ను స్థాపించి..వీళ్ల‌కు రూ.3 వేల కోట్ల‌తో భ‌వ‌నాలు క‌ట్టించ‌డం. ఆ భ‌వ‌నాల్లో బ‌ల్స్ మిల్క్ కూలింగ్ యూనిట్ పెట్టించ‌డం. య‌ధావిధంగా పాల నాణ్య‌త‌ను కొలిచేందుకు మిష‌న‌రీ ఏర్పాటు చేస్తున్నాం. గ్రామీణ వ్య‌వ‌స్థ‌లో ఒక బూస్ట్ వ‌స్తుంది. ప‌ది రోజుల్లోనే నేరుగా పెవ్‌మెంట్ ఇచ్చే కార్య‌క్ర‌మం ఉంటుంది. నేరుగా ఖాతాల్లోకి డ‌బ్బులు జ‌మ చేస్తుంది. మొద‌టి ద‌శ‌లో వైయ‌స్ఆర్ క‌డ‌ప‌, చిత్తూరు, ప్ర‌కాశం జిల్లాల్లోని 400 గ్రామాల్లో ఇప్ప‌టికే ప‌శువుల‌ను పంపిణీ చేశాం. వ‌చ్ ల‌క్ష యూనిట్ల ఆవులు, గేదెల పంపిణీ పూర్తి చేస్తాం. మ‌రో 3.60 ల‌క్ష‌ల యూనిట్లు పంపిణీ చేస్తున్నాం.

అమూల్ ఇచ్చే ధ‌ర‌లు కూడా గ‌మ‌నిస్తే..గేదె పాలు హెరిటేజ్ లీట‌ర్‌కు రూ.33 ఇస్తే, అమూల్ రూ.37 ఇస్తుంది. ఆవు పాలు హెరిటేజ్ రూ.23 ఇస్తుంటే..అమూల్ రూ.28 లీట‌ర్‌కు ఇస్తుంది. ఎక్క‌డ చూసినా కూడా అమూల్ ఎక్కువ రేటుకు కొనుగోలు చేస్తోంది. ఆ త‌రువాత లాభాల‌ను కూడా బోన‌స్ రూపంలో ఇస్తుంది. ఇటీవ‌ల లోకేష్ అనే వ్య‌క్తి ఎల్లో మీడియాలో మాట్లాడార‌ట‌. అమూలు వ‌చ్చినా హెరిటేజ్ చ‌నిపోదు.. అన్నార‌ట‌. దాని అర్థం ఏంటో తెలియ‌డం లేదు. అంటే హెరిటేజ్ త‌క్కువ రేటు ఇచ్చిన‌ట్లే క‌దా?
చంద్ర‌బాబు..హెరిటేజ్ పై ఉన్న కోపంతోనో ఇది తేవ‌డం లేదు. అలాంటి మైండ్ సెట్ కూడా మాకు లేదు. అక్ష‌రాల 24 ల‌క్ష‌ల మంది అక్కాచెల్లెమ్మ‌ల‌కు డ‌బ్బులు ఇస్తున్నాం. ఇంత డ‌బ్బులు ఇస్తున్న స‌మ‌యంలో స‌రైన ప‌ద్ధతిలో వారు పెట్టుబ‌డి పెట్ట‌గ‌లిగితే ఎక్క‌డా కూడా రిస్క్ ఉండ‌ద‌నే ఉద్దేశంతో ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. వీరు ఆర్థికాభివృద్ధి సాధిస్తార‌న్న త‌ప‌న‌, తాప‌త్ర‌యంతో అమూల్ తెచ్చాం. అమూల్‌, ఐటీసీ, రిల‌య‌న్స్ అన్నీ కూడా అక్కా చెల్లెమ్మ‌ల‌కు మంచి చేసేందుకే వ‌చ్చాయి. చంద్ర‌బాబుపై కోపంతో తెచ్చిన‌వి కావ‌ని, అక్కా చెల్లెమ్మ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నా..అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

 

Back to Top