ప్రత్యేకహోదాపై అసెంబ్లీలో తీర్మానం

తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గత ప్రభుత్వ నిర్వాకంతో ఎంతో నష్టపోయాం

జాప్యం లేకుండా హోదా ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం

అమ‌రావ‌తి:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మెజార్టీ ప్రజల అభిప్రాయాలను ఖతారు చేయకుండా అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని  సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఏపీ జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో ఆయన గళం వినిపించారు.ఐదు కోట్ల ప్రజల తరపున ప్రత్యేకహోదా కావాలని ప్రకటన చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.  ఏపీ ఆర్థికంగా నిప్పుల మీద నడవలసి వస్తుందని,ఉద్యోగాలు,అన్ని రంగాల్లో నష్టపోతామని తెలిసి మొండిగా ముందుకు వెళ్ళామన్నారు. రాష్ట్ర విభజన నష్టాలను ప్రత్యేకహోదా సాధన ద్వారానే ఎంతోకంత పూడ్చుకోగలుగుతామని, రాష్ట్ర ప్రయోజనాలు  కోసం ప్రత్యేకహోదా  ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా మరో సారి ఎందుకు తీర్మానం చేయాల్సి వస్తుందన్నారు. గతంలో ఈ అసెంబ్లీలోనే ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల.. మా ప్యాకేజీ వద్దు..ప్రత్యేకహోదా కావాలని మరోసారి తీర్మానం పంపుతున్నామన్నారు.గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయన్ని గత ప్రభుత్వం సరిదిద్దక పోగా అన్యాయాలు మరింత పెరగడానికి కారణమయ్యిందని పేర్కొన్నారు.

గత ఐదేళ్లలో రాష్ట్రానికి రూ. 66,300 కోట్ల రెవెన్యూ లోటు ఉందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉపాధి కల్పన సామర్థ్యం తగ్గిపోయిందని... ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని తెలిపారు. కేవలం ప్రత్యేక హోదా ద్వారానే విభజన నష్టాలను పూడ్చుకోవచ్చని చెప్పారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదానే అవసరమని అన్నారు. 14 ఆర్థిక సంఘం సిఫారసు పేరుతో ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని చెప్పారు. ప్రణాళికసంఘంతో గత టీడీపీ ప్రభుత్వం మాట్లాడకపోవడం వల్లే హోదా రాలేదని ఆరోపించారు. విభజనతో నష్టపోయినదాన్ని ప్రత్యేక హోదాతో భర్తీ చేస్తామని పార్లమెంటు సాక్షిగా అప్పట్లో హామీ ఇచ్చారని అన్నారు. ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదని చెప్పారు.

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ..

 • ఉమ్మడి రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడంతో ఏపీకి అన్యాయం 
 • విభజనతో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయింది
 • గత ప్రభుత్వం నిర్వాకంతో అన్యాయం పెరిగింది
 • విభజన నష్టాలను ప్రత్యేక హోదాతోనే పూడ్చగలం
 • ప్రత్యేక ప్యాకేజీ వద్దు..హోదానే కావాలని తీర్మానం చేస్తున్నాం
 • ప్రత్యేక హోదా కోసం మరోసారి తీర్మానం చేస్తున్నాం
 • రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించారు.
 • ఆదాయాన్ని సరిగ్గా పంచలేదు
 • గత ఐదేళ్లలో రెవెన్యూ లోటు 66.362 కోట్లకు పెరిగింది.
 • సాప్ట్‌వేర్‌తో పాటు అన్ని రంగాల్లో అత్యుత్తమ ఆర్థిక కేంద్రం హైదరాబాద్‌
 • 2015–2016లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14411, ఏపీ ఆదాయం రూ.8397 కోట్లు
 • 2014లో ఏపీ రుణం రూ.97 వేల కోట్లు, ఇప్పుడు రూ.258928 కోట్లు
 • ప్రతి ఏటా అసలు రూ.20 వేల కోట్లు, వడ్డీ మరో రూ.20 వేల కోట్లు చెల్లించాలి
 • మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని విభజించారు
 • విభజనతో ఏపీకి 59 శాతం జనాభా ఉంటే ఆదాయం మాత్రం 47 శాతం వచ్చింది
 • విభజన సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేదు
 • ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి
 • హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది
 • హోదా ఇవ్వకపోవటానికి రకరకాల వాదనలు వినిపించాయి
 • ప్యాకేజీ వద్దు..ప్రత్యేక హోదానే కావాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుదాం
 • జాప్యం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top