వేసే ప్రతీ అడుగు ఎన్నికల దిశగానే ఉండాలి

175 స్థానాలు సాధించడం క‌ష్టం కాదు, అసాధ్యం కానే కాదు

గ్రామస్థాయి నుంచి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి

అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

తాడేపల్లి: ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని సన్నద్ధం చేయాలి. ఇకపై వేసే ప్రతీ అడుగు ఎన్నికల దిశగానే ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కార్యకర్తలకు సీఎం వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం వారీగా కార్యకర్తలను కలుసుకోవడం ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లుగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న మంచిని గణాంకాలతో సహా కార్యకర్తలకు వివరించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని, ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. ఈ మూడున్నరేళ్లలో అద్దంకి నియోజకవర్గంలో 93,124 కుటుంబాలకు మేలు చేశామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను మన ప్రభుత్వం అందిస్తుందన్నారు. నేను, మీరు కలిస్తేనే 175 స్థానాలకు  175 అసెంబ్లీ స్థానాలు సాధించగలమని, ఇదేమీ కష్టం కాదు, అసాధ్యం కానేకాదని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top